ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఇలా చేయండి!

2018-19లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి సంఖ్య 5.42 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈసారి 71% మంది ఎక్కువగా ఐటీఆర్ ఫైల్ చేశారు.

news18-telugu
Updated: September 3, 2018, 4:03 PM IST
ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఇలా చేయండి!
2018-19లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి సంఖ్య 5.42 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈసారి 71% మంది ఎక్కువగా ఐటీఆర్ ఫైల్ చేశారు.
  • Share this:
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు ముగిసింది. వాస్తవానికి జూలై 31 వరకే ఐటీఆర్ ఫైల్ చేయాలి. కానీ ఐటీ డిపార్ట్‌మెంట్ ఆగస్ట్ 31 వరకు అవకాశమిచ్చింది. గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో ఈసారి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగింది. 2018-19లో ఐటీఆర్ ఫైల్ చేసిన వారి సంఖ్య 5.42 కోట్లు. గతేడాది ఈ సంఖ్య 3.17 కోట్లు మాత్రమే. ఈసారి 70.86% మంది ఎక్కువగా ఐటీఆర్ ఫైల్ చేశారు. చివరి రోజే 34.95 లక్షల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు.

అయితే ఇప్పటికీ కొంతమంది ఐటీఆర్ ఫైల్ చేయలేదు. ఆగస్ట్ 31లోగా ఫైల్ చేయకపోతే ఇక వచ్చే ఏడాది వరకు ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం లేదేమో అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ అలాంటిదేమీ కాదు. మీది జనరల్ కేటగిరీ(వేతనజీవులు) అయితే ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆగస్ట్ 31 చివరిరోజు. అదే మీరు వ్యాపారి అయితే, మీ అకౌంట్స్ ట్యాక్స్ ఆడిట్‌లో ఉంటే సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. వర్కింగ్ పార్ట్‌నర్ అయినా, పార్ట్‌నర్‌షిప్ సంస్థ అయినా సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నియమాలు వర్తించే వ్యాపారులకు నవంబర్ 30 వరకు గడువు ఉంటుంది.

మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదా?

మీరు ఆగస్ట్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీకు 31 మార్చి 2019 వరకు అవకాశముంటుంది. ఆ తర్వాత చేయలేరు. అయితే మీరు గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే ప్రస్తుత ఏడాదిలో బిజినెస్ లాస్, క్యాపిటల్ గెయిన్ లాస్ లాంటివి క్లెయిమ్ చేసుకోలేరు. అంతేకాదు... ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రావాల్సి ఉన్నా... దానిపై వచ్చే వడ్డీని కోల్పోతారు. మీరు చేసిన ఆలస్యానికి చెల్లించాల్సిన పన్ను కన్నా కాస్త అదనంగా కట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు ఆలస్య రుసుము కూడా చెల్లించాలి. ఈ ఆలస్య రుసుము మీరు ఎప్పుడు ఐటీఆర్ ఫైల్ చేశారు, మీ ఆదాయం ఎంత అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. డిసెంబర్ 31లోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే ఆలస్య రుసుము రూ.5,000 చెల్లించాలి. ఒకవేళ డిసెంబర్ 31లోగా ఫైల్ చేయకపోతే ఆ తర్వాత రూ.10,000 ఆలస్య రుసుము వర్తిస్తుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే వారికి ఆలస్య రుసుము రూ.1,000 మాత్రమే.మార్చి 31 వరకు కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే..?
మీరు మార్చి 31 వరకు కూడా ఐటీఆర్ ఫైల్ చేయలేదంటే భారీ జరిమానా చెల్లించాల్సిందే. మీ ఆదాయంపై 50 శాతం జరిమానా విధిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. దాంతో పాటు ఐటీఆర్ ఫైల్ చేయనందుకు విచారణ ఎదుర్కొని, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. రెండు నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించొచ్చు.

సో... తెలుసుకున్నారుగా... గడువు ముగిసిందని బాధపడకుండా మీకు ఉన్న మరిన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఐటీఆర్ ఫైల్ చేయండి.ఇవి కూడా చదవండి:

కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయా?

Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?

ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!
First published: September 3, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>