బిట్‌కాయిన్స్‌ లాభాలపై ట్యాక్స్ కట్టారా?

మీరు బిట్‌కాయిన్స్‌ లావాదేవీలతో లాభాలు ఆర్జించారా? ఆ ఆదాయంపైనా పన్నులు చెల్లించాల్సిందే. మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ బిట్‌కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్టైతే మీకూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్(ఎల్‌టీసీజీ) వర్తిస్తుంది.

news18-telugu
Updated: July 16, 2018, 1:40 PM IST
బిట్‌కాయిన్స్‌ లాభాలపై ట్యాక్స్ కట్టారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బిట్ కాయిన్స్, క్రిప్టోకరెన్సీ ప్రపంచాన్ని గతేడాది మలుపుతిప్పింది. ఒక బిట్‌కాయిన్ ధర 20 వేల డాలర్లు(రూ.13,40,000)ధరను తాకింది. అంతే ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్ గురించి చర్చ మొదలైంది. బిట్ కాయిన్ సొంతం చేసుకోవాలని చాలామంది తహతహలాడారు కూడా. కానీ ఆ తర్వాత బిట్‌కాయిన్ ధర ఒక్కసారిగా 6,000 డాలర్లకు పడిపోయింది. అయితే అంతకముందే బిట్ కాయిన్స్ అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకున్నారు. మంచి లాభాలను ఆర్జించారు. అయితే బిట్ కాయిన్ అమ్మగా వచ్చిన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

బిట్‌కాయిన్‌లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారా లేక పెట్టుబడి రూపంలో హోల్డ్ చేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడి అయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. బిట్‌కాయిన్స్‌ని ట్రేడింగ్ చేస్తున్నట్టైతే వ్యాపారంపై వచ్చిన ఆదాయంగా చూపాల్సి ఉంటుంది. మీ టర్నోవర్ రూ.2 కోట్లు దాటితే ట్యాక్స్ ఆడిట్ చేయించాలి.

గౌతమ్ నాయక్, ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్


అయితే బిట్‌కాయిన్స్‌పై ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇంకా ఎలాంటి వర్గీకరణ చేయలేదు. అందుకే ఎంతకాలంగా బిట్‌కాయిన్స్ మీ దగ్గరున్నాయి? ఎంతకు కొన్నారు? ఎంతకు అమ్మారు? లాంటివన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే అది వ్యాపారమా? లేక పెట్టుబడా? అన్నది తేలుతుంది.

దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సిందే. అయితే ఆ లాభాలు లాంగ్ టర్మ్ కావచ్చు లేదా షార్ట్ టర్మ్ కావచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టంలో బిట్‌కాయిన్స్, క్రిప్టో కరెన్సీస్ గురించి ఎలాంటి నియమ నిబంధనలైతే లేవు. అందుకే సాధారణ నియమనిబంధనలు వర్తిస్తాయి. మీరు 36 నెలల కంటే ఎక్కువగా బిట్‌కాయిన్స్ హోల్డ్ చేసినట్టైతే ఎల్‌టీసీజీ వర్తిస్తుంది.
నవీన్ వాధా, డిప్యూటీ జనరల్ మేనేజర్, Taxmann.com


ఇన్వెస్టర్లకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పైనా అవగాహన ఉండాలి. దాన్ని జీతం ద్వారా వచ్చే ఆదాయంతో కలిపి స్లాబ్ రేట్ ఎంపిక చేస్తారు. అదే ఎల్‌టీసీజీ ట్యాక్స్ అయితే ఇన్వెస్టర్ 20 శాతం పన్ను చెల్లించాలి. బిట్‌కాయిన్స్ అమ్మి లాభాలు ఆర్జిస్తే ఐటీఆర్2 లేదా ఐటీఆర్3 ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.
Published by: Santhosh Kumar S
First published: July 16, 2018, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading