భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ (Festival Season) సందర్భంగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు స్పెషల్ ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ పెంచుకోవడానికి కళ్లు చెదిరే డిస్కౌంట్స్ (Discounts) ప్రకటిస్తున్నాయి. తాజాగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) కూడా కొన్ని కార్ల మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. ఈ అక్టోబర్‌లో టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ కార్లను కొనుగోలు చేసేవారు రూ.60,000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. పూర్తి ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.
* టాటా టియాగో
ఈ ఫెస్టివల్ సీజన్లో టియాగో పెట్రోల్ XT, XTO, XT రిథమ్ వేరియంట్స్ రూ.30,000 వరకు డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ డిస్కౌంట్లో కన్స్యూమర్ స్కీమ్ రూ.20,000 కాగా, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.10,000గా ఉంటుంది. XT, XTO, XT రిథమ్, AMT మినహా అన్ని ఇతర వేరియంట్లకు కన్స్యూమర్ స్కీమ్ రూ.15,000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.10,000 వరకు ఉంటుంది. అంటే మొత్తంగా రూ.25,000 డిస్కౌంట్‌తో ఈ కారు వేరియంట్లను కొనుగోలు చేయవచ్చు. ఇక టియాగో CNG అన్ని వేరియంట్లపై రూ.30,000 కన్స్యూమర్ స్కీమ్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా రూ.40,000.
* టాటా సఫారీ
జెట్, కెజెడ్ఆర్ మినహా అన్ని టాటా సఫారీ వేరియంట్లు రూ.50,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తాయి. వీటికి కన్స్యూమర్ స్కీమ్ అందుబాటులో లేదు. అయితే, KZR వేరియంట్‌పై మొత్తం రూ.60,000 తగ్గింపు ఉంది. మీరు కన్స్యూమర్ స్కీమ్ రూపంలో రూ.20,000, ఎక్స్ఛేంజ్ రూపంలో రూ.40,000 డిస్కౌంట్ అందుకోవచ్చు.
* టాటా హారియర్
జెట్, KZR మినహా టాటా హారియర్ అన్ని వేరియంట్లపై రూ.50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. వీటికి కన్స్యూమర్ స్కీమ్ అందుబాటులో లేదు. అయితే, KZR వేరియంట్‌పై రూ.20,000 కన్స్యూమర్ స్కీమ్, రూ.40,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. అంటే దీనిపై మీరు మొత్తంగా రూ.60,000 తగ్గింపు పొందొచ్చు.
ఇది కూాడా చదవండి : కారు కొంటే రూ.లక్ష తగ్గింపు.. కంపెనీ బంపరాఫర్!
* టాటా టిగోర్
ఈ పండుగ సీజన్లో టిగోర్ పెట్రోల్ అన్ని వేరియంట్లపై మొత్తం రూ.30,000 తగ్గింపును అందుకోవచ్చు. ఇందులో కన్స్యూమర్ స్కీమ్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. కాగా టిగోర్ సీఎన్జీపై మొత్తం తగ్గింపు రూ.40,000. ఇందులో కన్స్యూమర్ స్కీమ్ రూ.25,000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.15,000.
* టాటా ఆల్ట్రోజ్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ రూ.20,000 డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇందులో రూ.10,000 కన్స్యూమర్ స్కీమ్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA) వేరియంట్లను మినహాయించి అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.
ఈ డిస్కౌంట్ పీరియడ్ అక్టోబర్ 6న స్టార్ట్ కాగా.. అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ డిస్కౌంట్ స్కీమ్ MY21, MY22 మోడల్స్‌కు వర్తిస్తుంది. కాగా టాటా కంపెనీ తన మోస్ట్ పాపులర్ పంచ్, నెక్సాన్, ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించకపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Diwali, New cars, Tata cars, Tata Motors