హోమ్ /వార్తలు /బిజినెస్ /

Harley Davidson X350: రూ.3.93 లక్షలకే హార్లీ డేవిడ్సన్‌ X350 బైక్‌ లాంచ్.. ఫీచర్స్ అదుర్స్ అంతే!

Harley Davidson X350: రూ.3.93 లక్షలకే హార్లీ డేవిడ్సన్‌ X350 బైక్‌ లాంచ్.. ఫీచర్స్ అదుర్స్ అంతే!

Harley Davidson X350: రూ.3.93 లక్షలకే హార్లీ డేవిడ్సన్‌ X350 బైక్‌ లాంచ్..

Harley Davidson X350: రూ.3.93 లక్షలకే హార్లీ డేవిడ్సన్‌ X350 బైక్‌ లాంచ్..

Harley Davidson X350: హార్లీ డేవిడ్సన్‌ తక్కువ ధరకు హార్లీ డేవిడ్సన్ X350 (Harley-Davidson X350) మోటార్‌సైకిల్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ చైనాలో రిలీజ్‌ అయింది. 350 cc మోటార్‌సైకిల్ ధర 33,000 యువాన్ (సుమారు రూ.3.93 లక్షలు)గా కంపెనీ తెలిపింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మంది యువకులకు బైక్‌లంటే అమితమైన ఇష్టం ఉంటుంది. అందులోనూ ప్రీమియం బైక్‌లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారు ఎక్కువగా కొనాలని ఆశపడే వెహికల్స్‌లో హార్లీ డేవిడ్సన్‌ బ్రాంక్ కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ బైక్‌లకు అభిమానులు ఉన్నారు. అలాంటి వారికి ఓ గుడ్‌న్యూస్‌. హార్లీ డేవిడ్సన్‌ ఇప్పుడు తక్కువ ధరకు హార్లీ డేవిడ్సన్ X350 (Harley-Davidson X350) మోటార్‌సైకిల్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ చైనాలో రిలీజ్‌ అయింది. 350 cc మోటార్‌సైకిల్ ధర 33,000 యువాన్ (సుమారు రూ.3.93 లక్షలు)గా కంపెనీ తెలిపింది. హార్లీ డేవిడ్సన్ సిరీస్ లో అతి తక్కువ ధరకు ఈ బైక్ రావడం విశేషం.

* హార్లీ డేవిడ్సన్‌ X350 స్పెసిఫికేషన్స్

గతంలో డిస్‌కంటిన్యూ చేసిన స్పోర్ట్‌స్టర్ XR1200X ఆధారంగా హార్లీ డేవిడ్సన్‌ X350 బైక్‌ను తయారు చేశారు. ఇది సర్క్యులర్‌ హెడ్‌ ల్యాంప్‌ క్లాసిక్ లుక్‌ను అందిస్తోంది. ఇదే డిజైన్‌లో సర్క్యులర్‌ మోనోపాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. 350cc టూ-వీలర్‌లో టియర్ డ్రాప్డ్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఇదే డిజైన్ ప్యాట్రన్ వెనుక భాగం వరకు కొనసాగుతుంది.

బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్లు అమర్చినట్లు తెలుస్తోంది. ముందువైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక వైపు మోనో షాక్‌ను అందిస్తుంది. హార్లీ డేవిడ్సన్‌ మోటార్‌సైకిల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అల్లాయ్ వీల్స్ ముందు 120/70 టైర్, వెనుక 160/60 టైర్‌తో వస్తాయి.

ఇది కూడా చదవండి : మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర తెలిస్తే మీ ఫ్యూజుల్ ఔట్, కొత్త కారు కొనొచ్చు!

హార్లీ డేవిడ్సన్‌ X350 బ్రేక్‌లో నాలుగు-పిస్టన్ కాలిపర్‌లతో ముందువైపు ఒకే డిస్క్ వస్తుంది. అదే విధంగా వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే డిస్క్‌ ఉంటుంది. డిస్క్ బ్రేక్‌ల పరిమాణం ఇంకా తెలియదు, కానీ X350 180 కిలోల బరువు ఉంటుంది. 353 cc ప్యార్లల్‌-ట్విన్ ఇంజిన్‌ను ఈ నయా బైక్‌లో పొందుపర్చింది. ఈ ఇంజన్ 36.2 బిహెచ్‌పి, 31 ఎన్ఎమ్ మోటార్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఫ్యూయల్‌ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. చైనాలో X350 బైక్‌ జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ వంటి కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తోంది.

* ఇండియాలో లాంచ్‌ అవుతుందా?

హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హార్లీ డేవిడ్సన్‌ ఇండియన్‌ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో మోటార్‌సైకిల్ విడుదలపై ఎటువంటి సమాచారం లేదు. అయితే మోటార్‌సైకిల్ భారత్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. చైనా కంపెనీ క్యూజే మోటార్స్‌తో కలిసి హ్యార్లీ డేవిడ్సన్‌ హార్లే డేవిడ్సన్ X350 మోటార్‌సైకిల్‌ను రూపొందించింది. ఇప్పటికే భారత మార్కెట్లో మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న బెనెల్లీ కూడా QJ మోటార్స్ సొంత కావడం గమనార్హం.

First published:

Tags: Auto, Bikes, Harley Davidson, New bike

ఉత్తమ కథలు