Harley Davidson: హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 అడ్వెంచర్ బైక్ బుకింగ్స్​ ప్రారంభం.. ధర ఎంతంటే?

Harley-Davidson (image: Harley-Davidson)

ఏప్రిల్‌లో హార్లే-డేవిడ్సన్ పాన్​ అమెరికా 1250 అడ్వెంచర్​ టూరర్​ బైక్​ను లాంచ్​ చేసింది. మొదటి విడత బుకింగ్స్ పూర్తి కాగా, ఇప్పుడు మరోసారి భారతీయ వినియోగదారుల కోసం హీరో మోటోకార్ప్ ఈ బైక్​ బుకింగ్స్​ను ప్రారంభించింది.

  • Share this:
Harley-Davidson:  గతేడాది దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్, సేల్స్ నిలిపివేసిన అమెరికన్​ ప్రీమియం వాహన తయారీ సంస్థ Harley-Davidson.. హీరో మోటోకార్ఫ్​తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్​లో తమ వాహనాల అమ్మకాలను హీరో మోటోకార్ప్​కు అప్పగించింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య గతేడాది లైసెన్సింగ్ అగ్రిమెంట్ కూడా జరిగింది. అప్పటి నుంచి హీరో మోటోకార్ప్ ప్రీమియం మోటార్ సైకిళ్లను Harley-Davidson బ్రాండ్ పేరుతో సేల్​ చేస్తుంది. ఈ ఏప్రిల్‌లో హార్లే-డేవిడ్సన్ పాన్​ అమెరికా 1250 అడ్వెంచర్​ టూరర్​ బైక్​ను లాంచ్​ చేసింది. మొదటి విడత బుకింగ్స్ పూర్తి కాగా, ఇప్పుడు మరోసారి భారతీయ వినియోగదారుల కోసం హీరో మోటోకార్ప్ ఈ బైక్​ బుకింగ్స్​ను ప్రారంభించింది.

ఇది చదవండి... TVS Sport : కిలోమీటర్‌కు జస్ట్ 90 పైసలు మాత్రమే ఖర్చయ్యే బైక్ ఇదే..

ఈ బైక్​ రూ .16.90 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రీమియం విభాగంలోని బీఎండబ్ల్యూ ఆర్​ 1250 జీఎస్​, డుకాటి మల్టీస్ట్రాడా V4 బైక్​లకు ఇది గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ బైక్ స్టాండర్డ్​, స్పెషల్​ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ రెండింటిలోనూ ఫుల్-ఎల్ఈడి లైటింగ్, బ్లూటూత్-ఎనేబుల్డ్ 6.8 అంగుళాల కలర్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, యూఎస్‌బి టైప్ సి అవుట్‌లెట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లను అందించింది. Harley-Davidson

ఇందులోని 1,252 సీసీ మాక్స్ 1250 ఇంజిన్​.. 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి టార్క్​ను, 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 127 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు బైక్‌లలో 6 స్పీడ్ ట్రాన్స్​మిషన్​ యూనిట్​ను సంస్థ అందజేసింది. ఈ పాన్ అమెరికా 1250 అడ్వెంచర్​ మోడల్.. బైక్​ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని కోసం బైక్​ లవర్స్​ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో హార్లీ-డేవిడ్‌సన్ నుంచి విడుదలైన మొదటి బైక్​ ఇదే కావడం విశేషం.

నష్టాల కారణంగా హీరో మోటోకార్ప్​​తో ఒప్పందం..
కరోనా కారణంగా తీవ్ర నష్టాలు రావడంతో హార్లే డేవిడ్సన్​ గతేడాది భారత మార్కెట్​ నుంచి వైదొలిగింది. ఇకపై తమ బైక్స్​ సేల్స్​ను హీరో మోటోకార్ప్ నిర్వహిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు గతేడాది అక్టోబర్‌లో హీరో మోటోకార్ఫ్​తో ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి హీరో మోటోకార్ఫ్​ కస్టమర్ టచ్ పాయింట్లు, సర్వీస్​ సెంటర్లను విస్తరిస్తూ వస్తోంది. హీరో ఇప్పుడు హార్లీ-డేవిడ్సన్ కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా 14 పూర్తి స్థాయి డీలర్‌షిప్‌లు, ఏడు అధీకృత సేవా కేంద్రాలను కలిగి ఉంది. హార్లే-డేవిడ్‌సన్ ఇండియా డీలర్ నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో సిద్ధమైనందున HOG (హార్లే ఓనర్స్ గ్రూప్) ఈవెంట్‌లను తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది.
Published by:Krishna Adithya
First published: