Harley-Davidson EV: త్వరలో హ్యార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

Harley-Davidson EV: త్వరలో హ్యార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ (image: Harley-Davidson)

Harley-Davidson EV | ప్రముఖ మోటార్ సైకిళ్ల కంపెనీ హ్యార్లీ డేవిడ్సన్ లైవ్ వైర్ పేరుతో కొత్త బ్రాండ్‌ను ప్రకటించింది. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది.

  • Share this:
విద్యుత్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. పర్యావరణ హితమే కాకుండా స్టైల్ విషయంలోనూ ఆకట్టుకునే వాహనాల కోసం వినియోగదారుల ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే విద్యుత్ మోటార్ సైకిళ్లపై ఆటో సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ హ్యార్లీ డేవిడ్సన్ కూడా చేరింది. ఫస్ట్ లైవ్ బ్రాండెడ్ మోటార్ సైకిల్ ను ముందుకు తీసుకురానుంది. జులై8న జరిగే అంతర్జాతీయ మోటార్ సైకిల్ షోలో విద్యుత్ వాహనాన్ని ప్రదర్శించనున్నట్లు సోమనారం నాడు అధికారిక వెబ్ సైట్లో ప్రకటన విడుదల చేసింది.

ఈ ఐకానిక్ అమెరిన్ తయారీ సంస్థ ఇప్పటికే ఈ వాహనానికి లైవ్ వైర్ అనే బ్రాండ్ పేరును ఉపయోగిస్తోంది. దీని ధర వచ్చేసి 29,799 డాలర్ల(రూ.21,88,825.95 లక్షలు) నుంచి ప్రారంభమవనున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు.
గత ఫిబ్రవరిలో ఈ కంపెనీ సీఈఓగా జోచెన్ జెట్జ్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఉత్పత్తికి సంబంధించి ధరల్లో కోత, మేనేజ్మెంట్ ఖర్చులు తగ్గింపులు లాంటి చర్యలు అవలంభించడం ప్రారంభించారు. హ్యార్లీ కోర్ హెవీ వెయిట్ బైక్ సిగ్మెంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. హ్యార్లీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న జోచెన్ అసలు సిసలైన విద్యుత్ మోటార్ సైకిల్ తయారీకి శ్రీకారం చుట్టారు.

Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Card Transactions: క్రెడిట్, డెబిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేయలేకపోతున్నారా? ఇలా యాక్టివేట్ చేయండి

ఈ లైవ్ వైర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ ద్వారా విద్యుత్ మోటార్ సైకిల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని జోచెన్ ప్రకటనలో తెలిపారు. ఈ నూతన బ్రాండ్ ముందుగా అర్బన్ బైక్స్ పై దృష్టి సారించనుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా హార్లీ డేవిడ్సన్ కు వచ్చే లాభంలో ఎక్కువ భాగం స్మాలర్, లైటర్ మోడళ్ల కంటే సుదూర క్రూయిజర్లే ఆక్రమించాయి. ప్రతిభావంతులను ఆకర్షించడానికి ఈ బ్రాండ్ వర్చువల్ హెడ్ క్వార్టర్ గా ఉంటుందని చెప్పారు.

Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్

Realme 8 5G: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే రూ.549 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్

గత సెప్టెంబరులో భారత్ లో హ్యార్లీ డేవిడ్సన్ తన కార్యకలాపాలను ముగించింది. అధిక లాభదాయకత కలిగిన మోటార్ సైకిళ్లు అధిక ప్రాధాన్యం ఇస్తామని, అలాగే అమెరికా మార్కెట్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కంపెనీ బారత కార్యకలాపాలకు గుడ్ బై చెప్పేసింది. 2020 కంపెనీ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ దాదాపు 169 మిలియన్ డాలర్లు ఉండొచ్చని హ్యార్లీ డేవిడ్సన్ పేర్కొంటుంది. దేశంలో 70 మంది ఉద్యోగుల తొలగింపు కూడా ఇందులో భాగంగానే చెప్పుకొచ్చింది. ఈ కంపెనీ అంతర్జాతీయ విక్రయాల్లో భారత్ వాటా 5 శాతం దిగువగానే ఉందని తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published: