హర్ ఘర్ చుప్ చాప్‌సే కెహతా హై: ఒక తరాన్ని నిర్వచించే టీవీ కమర్షియల్ ఇది

Har Ghar Chup Chap Se Kehta Hai | నిజానికి ఒగిల్వీ, క్రియేటివ్ జీనియస్ పీయూష్ పాండే కలిసి ఈ వీడియోను చిరకాలం గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు. వారు దీనిని 13 సంవత్సరాల క్రితం ప్రజలందరినీ ఎంతో ప్రభావితం చేసినదానిలానే తిరిగి సృష్టించారు.

news18-telugu
Updated: April 10, 2020, 3:36 PM IST
హర్ ఘర్ చుప్ చాప్‌సే కెహతా హై: ఒక తరాన్ని నిర్వచించే టీవీ కమర్షియల్ ఇది
హర్ ఘర్ చుప్ చాప్‌సే కెహతా హై: ఒక తరాన్ని నిర్వచించే టీవీ కమర్షియల్ ఇది
  • Share this:
మానవులు సామాజిక జంతువులు. సాంఘీకరణ యొక్క అవసరం ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా ఉంది. అందుకే 'క్వారంటైన్' మరియు 'ఐసోలేషన్' అనే పదాలు మనందరిలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మనం క్లిష్టమైన పరిస్థితులలో జీవిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితంతటికీ ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇది మనందరం మన ఇంట్లోనే కుటుంబసభ్యులందరితో కలిసి గడిపే విలువైన సమయం. అయితే లాక్‌డౌన్ ముగిసిన తరువాత కూడా మీరు రాబోయే సమయాన్ని కూడా ఎంతో ఆనందిస్తారని గమనించండి.

మనఇళ్ళు, మన కుటుంబాలతో సామాజికదూరాన్ని పాటించవలసిన ఈసమయంలో Asian Paints వారి ‘హర్ ఘర్ చుప్ చాప్‌సే కెహతా హై' ప్రచారం మనకు మద్దతుగా నిలుస్తుంది. తీరికలేని జీవితంలో మనం తరచుగా చేయలేని చిన్నచిన్న విషయాలను ఆస్వాదిస్తూ, అందరం కలిసి పనులుచేస్తూ గడుపుతున్నఈ సమయంలో ఒకరికొకరి మధ్య దూరం కరిగిపోతుంది. 2007లోమొట్టమొదటిసారిగా విడుదలైన టీవిసీ, అప్పటి ప్రేక్షకులలో ఎన్నోభావోద్వేగాలను రేకెత్తించింది. అయితే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇది పునరుద్దరించబడి, పునరావృతం చేయబడినది. వేరేకోణంలో దీనిని చూపడమంటే చాలా పెద్ద విషయం.ఇటువంటి సమయంలో మనకు చేరువైన ఒకబ్రాండ్, మన జీవితాల్లో ఒత్తిడి కారణంగా ఎన్నో మధురజ్ఞాపకాలను ఎలా కోల్పోతున్నామో తెలియచేసి, మన మొఖాల్లో చిరునవ్వుని పూయిస్తుంది. వీడియో నడుస్తున్నప్పుడు కుటుంబాలు 'ప్రాపంచిక', 'ప్రతిరోజూ' ఉండే చిన్నచిన్న పనులలో మునిగితేలుతున్నట్లు మేము గ్రహించాం. కానీ క్వారంటైన్ సందర్భంగా తీసుకున్నప్పుడు ఇది ఎన్నో భావోద్వేగాలను కలిగించింది. కుటుంబసభ్యులందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నచిత్రాలు, సరదాగా ఆడుకుంటూ, నవ్వుకుంటున్న వీడియోలకు, 'ఇంట్లో చేసిన' అనే అనుభూతి దానికి అదనపు ఆకర్షణను జోడిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఏదో ఒకవిధంగా ఆ వీడియోలో భాగమే అనిపిస్తుంది. ఈ వీడియోలో భావోద్వేగాలతో పాటు, 'ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి' అనే ముఖ్యమైన సందేశానికి కూడా సమాన ప్రాముఖ్యత ఇవ్వబడినది.

నిజానికి ఒగిల్వీ, క్రియేటివ్ జీనియస్ పీయూష్ పాండే కలిసి ఈ వీడియోను చిరకాలం గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు. వారు దీనిని 13 సంవత్సరాల క్రితం ప్రజలందరినీ ఎంతో ప్రభావితం చేసినదానిలానే తిరిగి సృష్టించారు.

'ఇల్లు' అనే నాలుగు గోడల మధ్య మనకు ఉండే ఎన్నో జ్ఞాపకాలు, ఉండడానికి సురక్షితమైన ఇల్లు, ఎల్లప్పుడూ అండగా నిలిచే కుటుంబం ప్రాముఖ్యత గురించి మేము గ్రహించాము కావున, 'హర్ ఘర్ చుప్ చాప్‌సే కెహతా హై' వీడియో ప్రస్తుత సమయానికి తగినట్లుగా రూపొందించడం జరిగింది. దశాబ్దాలుగా అందమైన గృహాలను నిర్మించడంలో గర్వించదగిన Asian Paints బ్రాండ్, ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండమని కోరుతూ భద్రతా సందేశాన్ని అందించడంలో భాగం కావడం ప్రశంసనీయం.

 
First published: April 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading