హోమ్ /వార్తలు /బిజినెస్ /

Happy Ganesh Chaturthi: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాలు

Happy Ganesh Chaturthi: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాలు

Happy Ganesh Chaturthi: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Happy Ganesh Chaturthi: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాలు (ప్రతీకాత్మక చిత్రం)

Happy Ganesh Chaturthi | వినాయకుడి నుంచి బుద్ధి పాఠాలు మాత్రమే కాదు డబ్బు పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఏఏ పాఠాలు (Investment Lessons) నేర్చుకోవచ్చు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దేశమంతా వినాయక చవితి సందడి నెలకొంది. వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉంటాయి. అందులో డబ్బు పాఠాలు (Money Lessons) కూడా ఉన్నాయి. తొలిసారి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లు గణనాథుడి నుంచి 8 ఇన్వెస్ట్‌మెంట్ లెస్సన్స్ (Investment Lessons) నేర్చుకోవచ్చని తేజ్‌మందీ ఫౌండర్ వైభవ్ అగర్వాల్ మనీకంట్రోల్‌కు ఓ కథనంలో వివరించారు. మీరు తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టైతే వినాయకుడి నుంచి మీరేం పాఠాలు నేర్చుకోవచ్చో తెలుసుకోండి.

1. విజయం కోసం ప్రారంభించండి


ఎవరు ఏ కొత్త పని మొదలు పెట్టినా మొదట వినాయకుడికి పూజ చేయడం అలవాటు. అది ఏ ప్రయాణం అయినా అందులో ముఖ్యమైన భాగం తొలి అడుగు వేయడమే. డబ్బు విషయానికి వస్తే మీరు తొలి పెట్టుబడి పెట్టడమే తొలి అడుగు లాంటిది. మరి మీ ప్రయాణం వినాయక చవితి రోజే ప్రారంభిస్తే ఇంకా మంచిది.
Rs 1 Crore Returns: కోటి రూపాయలతో రిటైర్ అవడానికి పొదుపు చేయండిలా

2. తెలివితేటలతో పెట్టుబడి పెట్టండి


గణేషుడిని గజాననుడు అని కూడా పిలుస్తుంటారు. ఏనుగు తల తెలివితేటలను సూచించే చిహ్నం. పెట్టుబడి పెట్టేటప్పుడు తెలివితేటల్ని ఉపయోగించాలని అని వినాయకుడు మనకు చెబుతున్నాడు. అందుకే మీరు పెట్టుబడి పెట్టే అసెట్‌కు సంబంధించిన జ్ఞానం పెంచుకొని, అన్ని అంశాలు పరిశీలించి పెట్టుబడి పెట్టాలి.

3. వినడానికి సిద్ధంగా ఉండాలి


వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి. అందుకే లంబకర్ణుడు అని అంటారు. గణేశుడు ప్రతీ విషయాన్ని శ్రద్ధగా వింటాడు, గమనిస్తాడు అనడానికి ఇది గుర్తు. మీరు కూడా పెట్టుబడి పెట్టే ముందు ఇదే పని చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌కు సంబంధించి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్పే పూర్తి సమాచారాన్ని విని తెలుసుకోవాలి.

4. వివరాలు చూడాలి


గణనాథుడి కళ్లు చాలా షార్ప్ అని చెబుతుంటారు. అందుకే చింతేశ్వర అని పిలుస్తారు. ఇది పరధ్యానాన్ని నివారించడంతోపాటు, ఏకాగ్రత సామర్థ్యానికి చిహ్నం. ఇన్వెస్టర్లు కూడా ఇలాగే తమ పెట్టుబడుల విషయంలో ఏకాగ్రతతో ఉండాలి. మీ ప్రణాళికకు కట్టుబడి ఉండాలి తప్ప అందరూ చెప్పే మాటల్ని విని అయోమయానికి గురికావొద్దు.
Pension Scheme: జీతంలో కొంత పొదుపు చేస్తే రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్

5. బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని వదిలించుకోండి


వినాయకుడి ఒక దంతం విరిగి ఉంటుంది. అందుకే ఏక దంతాయ అని పిలుస్తారు. మీరు కూడా మీ పోర్ట్‌ఫోలియోలో తక్కువ రిటర్న్స్ ఇస్తున్న, నష్టాలకు కారణమవుతున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ని తొలగించాలి.

6. ఫ్లెక్సిబిలిటీ, అనుకూలత


గణేశుడికి బలమైన, వంగిన తొండం ఉంటుంది. అందుకే వక్రతుండ అని పిలుస్తారు. ఇది ఫ్లెక్సిబిలిటీకి, అనుకూలతకు చిహ్నం. ఏదో ఒక సందర్భంలో భారీ రిటర్న్స్ అందించే మెరుగైన పెట్టుబడి అవకాశం మీకు కనిపించవచ్చు. ఈ సమయంలో మీ పోర్ట్‌ఫోలియో మార్పులు చేసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.

7. వినయంగా ఉండండి


వినాయకుడు అంత బలవంతుడు, శక్తివంతుడు అయినా మూషకాన్ని వాహనంగా ఎంచుకున్నాడు. ఇన్వెస్టర్లు కూడా తమ అంచనాలను అదుపులో పె్టటుకుంటూ, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి.
Card Tokenization: ఈ స్టెప్స్‌తో మీ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ టోకెనైజ్ చేయండి

8. అడ్డంకులు తొలగించుకోవాలి


గణనాథుడినే విఘ్నేశుడు అని పిలుస్తుంటారు. ఇందుకు కారణం విఘ్నాలను తొలగించడమే. మంచి పెట్టుబడికి కూడా ఇదే కావాలి. మీ ఆందోళనలు, అడ్డంకులు తొలగించి మీకు ఆనందం కలిగించేలా మీ పెట్టుబడులు ఉపయోగపడాలి.


వినాయకుడితో పోలుస్తూ ఇచ్చిన పెట్టుబడి సలహాలు రచయిత అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయాలకు Moneycontrol.com, telugu.news18.com, యాజమాన్యానికి సంబంధం లేదు. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఎక్స్‌పర్ట్స్ సలహాలు తీసుకోవాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Ganesh Chaturthi​ 2022, Investment Plans, Personal Finance, Save Money, Vinayaka Chavithi 2022

ఉత్తమ కథలు