Tata Group | పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు. తన సంపదలో (Money) ఎక్కువ భాగాన్ని ఇతరుల కోసం దానం చేసే గొప్ప మనసు. బిజినెస్ టైకూన్.. ఇంతకీ ఎవరు ఈయన అని అనుకుంటున్నారా? ఆయన రతన్ టాటా (Ratan Tata).
ఉప్పు దగ్గరి నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వరకు.. ఇలా చాలా విభాగాల్లో కార్యకలాపాలు అందిస్తున్న టాటా సన్స్ గౌరవ చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా పుట్టిన రోజు నేడు. అందుకే ఈయన గురించి మనం ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఇలా చాలా కంపెనీలు కలిగిన టాటా సన్స్‌కు బాస్‌గా కొనసాగుతూ వచ్చిన రతన్ టాటా ఎందుకని కుబేరుల జాబితాలో టాప్‌లో లేరు? ఆయన ఆస్తి ఎంత? వంటి విషయాలను మనం తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్‌పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!
దేశంలోని మోస్ట్ రెస్పెక్టెడ్ పారిశ్రామిక వేత్త ఎవరంటే ఆయన ఈయనే. కేవల దేశంలో మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా రతన్ టాటాకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య కోటికి పైగానే ఉంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం చూతే.. మోస్ట్ ఫాల్డ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్‌గా రతన్ టాటా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రతన్ టాటా ఫోలోవర్లు 18 లక్షలు పెరిగాయి.
కొత్తగా క్రెడిట్ కార్డు స్కీమ్.. వారికి కేంద్రం అదిరే శుభవార్త?
అపారమైన వ్యాపార సామ్రాజ్యం, మంచి పేరు వంటి ప్రశంసలు ఉన్నా కూడా రతన్ టాటా పేరు దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లేదు. ఈయన సంపద విలువ రూ. 3,800 కోట్లు. టాటా సన్స్ నుంచే ఆయన ఎక్కువగా రాబడి వస్తుంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో ఈయన 421వ స్థానంలో ఉన్నారు. 2021లో అయితే 433వ స్థానంలో నిలిచారు. ఎందుకని టాప్‌లో లేరు. అంటే దీనికి ప్రధాన కారణం దాతృత్వం. టాటా కంపెనీలు, హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నుంచి ఆర్జించే లాభంలో 66 శాతం మొత్తాన్ని టాటా ట్రస్ట్‌ల ద్వారా దాతృత్వ కార్యకలాపాలకు విరాళంగా ఇస్తున్నారు. అందుకే ఈయన సంపన్నుల జాబితాలో టాప్‌లో ఉండరు.
కాగా మార్కెట్‌లో లిస్ట్ అయిన టాటా కంపెనీలు ఏకంగా 29 వరకు ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిపి చూస్తే 311 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. రతన్ టాటా, ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచే దాతృత్వ కార్యక్రమాలలో ఉంది. గ్రూప్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. 2021-22లో టాటా కంపెనీల ఉమ్మడి ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా ఉంది. 935,000 కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ratan Tata, Tata Group, TATA Sons