Hallmarking: ఎగుమతి చేసే ఆభరణాలకు హాల్‌మార్కింగ్ నుంచి మినహాయింపు..విదేశీ ఎగుమతిదారులకు ఊరట

(ప్రతీకాత్మక చిత్రం)

ఎగుమతుల కోసం ఉద్దేశించిన ఆభరణాలను హాల్‌మార్కింగ్‌ నుంచి దూరంగా ఉంచాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు జెమ్ & జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) వెల్లడించింది. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుందని జిపిఇపిసి తెలిపింది.

  • Share this:
బంగారం కొనుగోలు, అమ్మకానికి సంబంధించి మోదీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధల ప్రకారం హాల్ మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఈ నూతన విధానాన్ని జూన్ 15 నుంచి అమలు చేయనుంది. ఇకపై, దేశంలోని నగల వ్యాపారులు కేవలం హాల్మార్కింగ్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే అమ్మాలి. లేదంటే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయితే, ఇతర దేశాలకు ఎగుమతి చేసే బంగారం విషయంలో మాత్రం హాల్మార్కింగ్ నిబంధలను సడలించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఎగుమతుల కోసం ఉద్దేశించిన ఆభరణాలను హాల్‌మార్కింగ్‌ నుంచి దూరంగా ఉంచాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు జెమ్ & జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) వెల్లడించింది. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుందని జిపిఇపిసి తెలిపింది. అదేవిధంగా, హాల్‌మార్కింగ్ చట్టాన్ని అమలు చేయడానికి అనుసరించాల్సిన నియమ నిబంధనలను విడుదల చేయనున్నట్లు జిజెఈపిసి పేర్కొంది. ఈ హాల్‌మార్కింగ్ నిబంధనలు భారతీయ వినియోగదారుల కోసమేనని, విదేశాలకు ఎగుమతి చేసే ఆభరణాలకు ఇది వర్తించదని జిజెఈపిపి స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై GJEPC చైర్మన్ కోలిన్ షా మాట్లాడుతూ, ‘‘ఎగుమతుల ప్రక్రియ సజావుగా సాగడానికి రత్నాలు, ఆభరణాలకు హాల్‌మార్కింగ్ విధానం నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. విదేశాల అవసరానికి అనుగుణంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. లేదంటే ఎగుమతులు బారీగా తగ్గి ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల విదేశాలకు ఎగమతి చేసే బంగారు ఆభరణాలపై హాల్మార్కింగ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం" అని అన్నారు.

విదేశీ ఎగుమతిదారులకు వెసులుబాట్లు..

తాజా నిర్ణయం ప్రకారం, హాల్‌మార్కింగ్ కింద బంగారం ఎగుమతులకు మినహాయింపు ఉంటుంది. కాబట్టి, ఎగుమతిదారులు ఎక్స్పోర్ట్ ఆర్డర్ కాపీ చూపించాల్సిన అవసరం లేదు.
ఫారిన్ ట్రేడ్ పాలసీ (ఎఫ్‌టిపి) కింద అనుమతించిన వివిధ ఎగుమతి కార్యకలాపాలకు హాల్‌మార్కింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద అనుమతి పొందిన విదేశీ ఎగ్జిబిషన్లలో దేశీయ బంగారు ఆభరణాలను ప్రదర్శించేందుకు హాల్మార్కింగ్ అవసరం లేదు.
వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన బిజినెస్ టు బిజినెస్ లోకల్ ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించే బంగారు ఆభరణాలకు సైతం హాల్మార్కింగ్ తప్పనిసరి కాదు.
కుందన్, మినాకారి, పోల్కి, జాడౌ వంటి చేతితో రూపొందించిన ఆభరణాలు, తేవా ఆభరణాలకు హాల్మార్క్ నుంచి మినహాయింపు ఉంటుంది.
Published by:Krishna Adithya
First published: