ఏప్రిల్ 1 నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇకపై నగల షాపుల్లో అమ్మే గోల్డ్ జ్యువెలరీపై యూనిక్ ఐడీ ఉంటుంది. దీన్నే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) అంటారు. బంగారు నగలు కొనే కస్టమర్లు మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. గతంలో నగలపై హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు హాల్‌మార్క్‌తో పాటు HUID కూడా ఉంటుంది. తాజా నిబంధనల ప్రకారం నగలపై మూడు గుర్తులు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో మొదటి గుర్తు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కి చెందిన హాల్‌మార్క్. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. రెండో గుర్తు నగల్లో బంగారం స్వచ్ఛత తెలియజేసే 18K, 22K అని ముద్ర ఉంటుంది.
తాజాగా అమలు చేసిన HUID కూడా నగలపై ఇక తప్పనిసరిగా ఉండాల్సిందే. HUID ఆరు డిజిట్స్ గల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇందులో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. ఈ కోడ్ ప్రతీ నగపై భిన్నంగా ఉంటుంది. ఈ కోడ్‌తో ఆ నగకు సంబంధించిన వివరాలు ట్రేస్ చేయొచ్చు. అంటే ఆ నగ ఎక్కడ తయారైంది, హాల్‌మార్క్ ఎక్కడ వేశారు, బంగారం స్వచ్ఛత ఎంత లాంటి వివరాలన్నీ తెలుస్తాయి.
Rs 1 Crore Returns: టీ, కాఫీ డబ్బులతో కోటీశ్వరులు కావొచ్చు... ఎలాగంటే
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో HUID ఎంటర్ చేసి ఆ నగలకు సంబంధించిన వివరాలుచెక్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో BIS CARE యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత verify HUID పైన క్లిక్ చేయాలి. మీ దగ్గరున్న నగలపై కనిపించే HUID నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ నగలపై ఉన్న HUID నెంబర్ సరైనదే అయితే హాల్‌మార్క్ వేయించిన నగల వ్యాపారి పేరు, వ్యాపారి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌మార్క్ వేయించిన కేంద్రం పేరు, రికగ్నిషన్ నెంబర్, అడ్రస్, నగల రకం, హాల్‌మార్క్ వేసిన తేదీ, బంగారం స్వచ్ఛత లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి.
మీరు ఏప్రిల్ 1 నుంచి ఏ నగల షాపులో ఆభరణాలు కొన్నా HUID ఉందేమో చెక్ చేయండి. ఒకవేళ అలాంటి నగలు కొంటే BIS CARE యాప్‌లో HUID వెరిఫై చేయండి. మరి ఇప్పటికే ఇప్పటికే కొన్న హాల్‌మార్క్ నగల సంగతేంటీ అని సందేహం రావడం మామూలే. పాత విధానం ప్రకారం హాల్‌మార్క్ ముద్రించిన నగలు చెల్లుతాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి కొనే నగలకు మాత్రం HUID తప్పనిసరి.
EPFO e-passbook: ఈపీఎఫ్ఓ కొత్త ఇ-పాస్‌బుక్ వచ్చేసింది... ఇలా డౌన్‌లోడ్ చేయాలి
ఇక ఇప్పటికే మీ దగ్గరున్న హాల్‌మార్క్ నగలు ఒరిజినలేనా కాదా అన్న విషయం తెలుసుకోవడానికి మీరు బీఐఎస్ గుర్తించిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్లో చెక్ చేయించవచ్చు. ఈ కేంద్రాల్లో మీ ఆభరణాలను టెస్ట్ చేయించి సర్టిఫికెట్ తీసుకోవచ్చు. దాదాపు ప్రతీ జిల్లా కేంద్రంలో అస్సేయింగ్ అండ్ హాల్‌మార్క్ సెంటర్లు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold jewellery, Gold Prices