హోమ్ /వార్తలు /బిజినెస్ /

గుణవత్థా సే ఆత్మనిర్భరత: భారతదేశపు భవిష్యత్ విజయాలకు దేశపు నిపుణత అభివృద్ధి కార్యక్రమ వాసి కీలకం

గుణవత్థా సే ఆత్మనిర్భరత: భారతదేశపు భవిష్యత్ విజయాలకు దేశపు నిపుణత అభివృద్ధి కార్యక్రమ వాసి కీలకం

గుణవత్థా సే ఆత్మనిర్భరత: భారతదేశపు భవిష్యత్ విజయాలకు దేశపు నిపుణత అభివృద్ధి కార్యక్రమ వాసి కీలకం

గుణవత్థా సే ఆత్మనిర్భరత: భారతదేశపు భవిష్యత్ విజయాలకు దేశపు నిపుణత అభివృద్ధి కార్యక్రమ వాసి కీలకం

భారతదేశపు భవిష్యత్ విజయాలకు దేశపు నిపుణత అభివృద్ధి కార్యక్రమ వాసి కీలకం. మనం సరిగ్గా వినియోగించుకుంటే, మన జనాభా మనకు అత్యంత పెద్ద ఆస్తి గా సంభవించవచ్చు.

  • Advertorial
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేవలం 75 వ స్వాతంత్య్ర వత్సరాన వున్న మనం జనాభా మధ్యగత వయస్సు 26 గా వున్న మనం అన్ని విధాలుగానూ యువ దేశమే. అంతేకాదు, 1 % జనాభా పెరుగుదల రేటు తో మన జనాభా ఏడాది ఏడాది కి చిన్న వయస్సు వాళ్ళు గా వుంటున్నారు. 15 -59 మధ్య ఏళ్ల ఉద్యోగస్థ-వయస్సు జనాభా 63 % గా అత్యంత అధికంగా వున్న దేశాలలో ఒకటైన మనం, త్వరితంగా వృద్ధులు అవుతున్న చైనా మరియు జపాన్ వంటి ఆర్ధిక వ్యవస్థల తో పోలిస్తే మనకు జనసంఖ్యాసంబంధిత (Demographic) లబ్ది వుంది.

మన యువ జనాభా మన అతి పెద్ద ఆస్తులలో ఒకటి, మరియు అది మన ఆర్ధిక వ్యవస్థను నడిపే అతి పెద్ద చోదకం. యువ జనాభా మనకు మానవ వనరులను అందించడమే కాకుండా మన ద్రవ్య నిలువల పెరుగుదల మరియు స్వదేశి వినిమియాలను ఏళ్ల తరబడి పెంపొందిస్తుంది. జనాభా అవసరమైన నైపుణ్యాలు కలిగివున్నప్పుడే అది సాధ్యపడుతుంది.

మన మానవ వనరుల నుండి అత్యంత లాభం పొందడానికి, 2022 నాటికి భారతదేశం లో 30 కోట్ల కంటే అధిక జనాభాకు వివిధ నిపుణతలలో శిక్షణ అందించాలని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 15 జూలై 2015 న స్కిల్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. ఈ బహు-ముఖమైన ఉద్యమం వివిధ చొరవలకు ఊతం ఇస్తుంది: National Skill Development Mission, National Policy for Skill Development and Entrepreneurship, 2015, Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY), Skill Loan scheme and the Rural India Skill initiative. భారత యువత ఉద్యోగ అర్హత పెంచే దిశగా ఈ ప్రతి చొరవ ఒక నిర్దిష్టమైన విభాగాన్ని లక్ష్యం గా చేసుకుంటుంది.

పరిశ్రమ-పాండిత్యము మధ్య అగాధం తొలగింపు

దురదృష్టవశాత్తూ, భారతదేశం లోని పరిశ్రమ-పాండిత్యం మధ్య అగాధం అందరికి తెలిసినదే. వారు చదివిన చదువు పారిశ్రామిక యజమాని ఆశించే నైపుణ్యం అందించలేని కారణంగా 10 +2 ఉత్తీర్ణులు అయిన ప్రతి 100 మంది విద్యార్థులలో కేవలం 26 మంది మాత్రమే ఉద్యోగస్తులవుతారు. మన అక్షరాస్యత పెరుగుతున్నా నైపుణ్యం లో లోటు ఇప్పటికి కొనసాగుతున్నదని దీని తాత్పర్యం.

ఈ నిర్దిష్ట సమస్య పరిష్కారానికి , ప్రభుత్వం National Skills Qualifications Framework (NSQF) లో నిక్షిప్తమైన ప్రమాణాల అనుసరణ ను పటిష్టం చేసే మార్గం కనుగొనవలసిన అవసరం వున్నది. యోగ్యత ఆధారంగా రూపొందించిన సంస్థ NSQF. ఇది ప్రజ్ఞ, నైపుణ్యం మరియు అభిరుచుల కనుగుణంగా అర్హతలను సంఘట పరుస్తుంది. విద్య సాంప్రదాయక, అసాంప్రదాయక లేదా అనియత (Informal) విధానాలలో నేర్చుకున్నా విద్యార్థి ప్రతి స్థాయి లోనూ కలిగిఉండాల్సిన ఫలితాలను ఇది స్పష్టముగా నిర్వచిస్తుంది.

మరొకవైపు, నిపుణత, జ్ఞానం మరియు ఒక ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహించే అవగాహనలను వివరించే నివేదిక National Occupational Standards (NOS): ఉద్యోగ నిర్వహణకు ఒక వ్యక్తి కి తెలియవలసిన విషయాలు మరియు చేయగలిగిన సమర్థతలను అవి నిర్దేశిస్తాయి. వివిధ విద్యా మరియు శిక్షణా కార్యక్రమాలకు ఇవి ప్రమాణాలుగా రూపొందుతాయి. NOS మరియు NSQF ల మధ్య సమలేఖనం పెక్కు లబ్ధులకు దారి తీస్తుంది.

ప్రారంభ దశ లో వున్నవారికి, ప్రమాణీకరించబడిన, నిలకడగల, యావత్తు దేశం మొత్తం లో అంగీకారయోగ్యమైన శిక్షణా ఫలితాలకు దారితీసే ఒక వాసి రూపం. అప్పుడు NSQF అంతర్జాతీయ సమానత్వం ద్వారా మన శిక్షిత మానవవనరులు ప్రపంచం లో ఎక్కడైనా అంగీకరించబడతారు. భవిష్యత్ ఉద్యోగస్తులు, యజమానులకు ఏకరీతిగా ఇది అన్ని రంగాలలోనూ ప్రగతి గతుల మానచిత్రణకు దారితీస్తుంది. దీని కారణంగా, తమ ఇష్టమైన పనుల విషయం లో ఉద్యోగస్తులు తమ అవగాహనా మార్గాలు అనుసరించగలరు, మరియు పై స్థాయి కి ఎదగడానికి యజమానులు తమ ఉత్తమ ఉద్యోగస్తులకు అవసరమైన మరియు సరైన శిక్షణ గుర్తించి అందులో పెట్టుబడులు పెట్టగలరు. అంతేకాకుండా, అనియత వ్యవస్థ నుంచి నిపుణతలు పొందినవారైనా సరే ఎవ్వరినీ విడిచివెయ్యకుండా వుండే విధంగా Recognition of Prior Learning (RPL) చూస్తుంది.

పఠిష్ట పునాదుల నిర్మాణం

ఈ స్థాయి కార్యక్రమ నిర్వహణ కొరకు వాసి కి సంబంధించిన పునాది మనుగడలో ఉండాల్సిన అవసరం వుంది. మనకు ప్రమాణాలు మరియు ప్రమాణీకరణలు, ఆ ప్రమాణాల అనుసరణను నియంత్రించే ఆడిటర్లు మరియు ఇన్స్పెక్టర్లు, అంతేకాకుండా ఈ ఆడిటర్లు మరియు ఇన్స్పెక్టర్లు అర్హులైన వారు అని నిర్ధారించే సంస్థలు మనకు అవసరం. Quality Council of India (QCI) ప్రమేయం ఇక్కడే వస్తుంది.

ఇప్పటికి 25 సంవత్సరాలుగా భారతదేశపు వాసి పర్యావరణ సృష్టి లో QCI భారీ పెట్టుబడులు పెడుతున్నది. పలు నిర్మాణక సంస్థల తో కూడినది QCI , భారతదేశపు నిపుణతలు పెంపొందించే కార్యక్రమాలు మరియు చొరవల విషయం లో కీలక పాత్ర పోషించే National Accreditation Board for Education and Training (NABET) అందులో ఒకటి.

విద్యా సంస్థలు, వృత్తి శిక్షణా సంస్థలు మరియు వివిధ నైపుణ్య ప్రమాణీకరణ సంస్థల గుర్తింపు మరియు ప్రమాణీకరణ కొరకు NABET స్థిరమైన యంత్ర రచన కలిగివున్నది. NABET దీనిని మూడు స్పష్ట మైన వెర్టికల్స్ లో నిర్వహిస్తుంది:

1. FEED (Formal Education Excellence Division): పాఠశాలల గుర్తింపు మరియు రాష్ట్ర మరియు ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన వివిధ వాసి నిర్ధారణ పథకాల నిర్వహణలే కాకుండా పాఠశాలల గుర్తింపు ప్రమాణాల గురించి అవగాహన పెంపొందించడం ఇది చేస్తుంది.

2. ప్రభుత్వ పథకాల విభాగం: Environment Impact Assessment (EIA) సలహాదారు సంస్థల గుర్తింపు తో బాటూగా MSME మంత్రిత్వ శాఖ యొక్క Lean Manufacturing Competitiveness Scheme కొరకు జాతీయ పర్యవేక్షణ మరియు ఆచరణ సంస్థగా ఇది పనిచేస్తుంది.

3. నైపుణ్య శిక్షణ మరియు సేవా విభాగం: శిక్షణా పాఠ్యఅంశాలు మరియు సలహాదారు సంస్థల రెంటి గుర్తింపు ఇది చూస్తుంది.

ఈ పునాదుల ఆధారంగా, SkillIndia's Life Cycle of Training partner & Training Centre వంటి చొరవలు చేపట్టవచ్చును. విద్యార్థులు వాసి విద్యా మరియు శిక్షణ కార్యక్రమాలు ఎంచుకోవడం లో సులువు ఏర్పరచే నిమిత్తం శిక్షణ భాగస్వాములు మరియు శిక్షణ కేంద్రాలు అవలంబించవలసిన వాసి రూఢి ప్రక్రియలను ఈ చొరవ క్రమబద్ధం చేస్తుంది.

సంస్థలు శిక్షణ ద్వారా తమ మానవనరుల ప్రమాణ మెరుగుదల ఆశిస్తాయి. తమ ఉద్యోగుల నైపుణ్యాలు పెంచదలచే సంస్థల అవసరాలు తీర్చడానికి QCI యొక్క Training and Capacity Building program (TCB) చాలా ఉపయోగపడగలదు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో శిక్షణ క్రమబద్ధీకరణ, అవగాహనా శిబిరాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల నిర్వహణ ద్వారా కేంద్రీయంగా మరియు ఒక నిర్దిష్ట విధానం లో అటువంటి కార్యక్రమాల అనుసంధానానికి దోహదపడుతుంది. వాసి నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణ, ఉత్పత్తి, పర్యావరణ, ఆహార భద్రతా, విద్య, పథక నిర్వహణ వంటి వివిధ రంగాలకు ఇది తమ సేవలు అందిస్తుంది.

అంతేకాకుండా, తరగతి గది శిక్షణ, చాక్షుష శిక్షణ, వెబినార్స్ మరియు ఈ లెర్నింగ్ వంటి మాధ్యమాల ద్వారా ఇది శిక్షణ అందిస్తుంది- వివిధ అవగాహనా పద్ధతులు, స్థాయిలు మరియు అవసరాలు కల విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యఅంశాలు ఎంచుకునేందుకు తోడ్పడుతుంది.

మొబైల్ మరియు అంతర్జాల వినియోగం అత్యధికంగా వున్న భారతదేశం లో ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్స్ పెద్ద నగరాలకు దూరంగా నివసించే ప్రజలు మరియు వ్యాపారాలకు ఉన్నత వాసి శిక్షణ మరియు విద్య అందించడం లో భారీ అవకాశాలు ఏర్పరుస్తాయి. ఇక్కడ కూడా తమ నిపుణతలు మరియు జ్ఞానం పఠిష్ట పరచుకొని తద్వారా వృత్తి లో పైకి ఎదిగే అవకాశాలను స్థిరం చేసుకోవడం కోసం భారతీయ వృత్తి నిపుణలకు వినియోగపడే , eQuest అనే ఒక ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ రూపం లో QCI మొదటి అడుగు వేసింది. ఈ కోర్సులు వ్యవసాయం, విద్య, పర్యావరణం, ఆరోగ్య పరిరక్షణ, పరిశోధకశాల, వాసి, సాంకేతికత మరియు సాధారణ అంశాల గురించి వుంటాయి.

అంతేకాకుండా, తమ సొంత శిక్షణా కార్యక్రమాలు మరియు శిక్షణ అందించే విధానాల రూపు కల్పించుకోవడం ద్వారా MSME ల శ్రమ తగ్గించే విధంగా కొన్ని కోర్సులు విశేషంగా MSME రంగపు అవసరాలను తీర్చే దిశగా ఉంటాయి. ఇది తక్కువ ఖర్చుతో ఉండేదే కాకుండా, తమ మానవవనరుల వాసి పెంచి తద్వారా ఉత్పత్తి వాసి కూడా పెంచే దిశగా ఇవి సహాయ పడతాయి.

సారాంశం/ముగింపు

భారతీయ ఆర్ధిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు కు వచ్చే రాబోయే సంవత్సరాలు కీలకం కాబోతున్నాయి. మన ఆర్ధిక వ్యవస్థ $5 ట్రిలియన్ మరియు దానికంటే అధికంగా చేరుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే, భారతదేశం లో తయారీ (Make In India ) ఫలించాలంటే మరియు భారతదేశం ఆర్ధిక ఆత్మనిర్భరత సాధించాలంటే మన మానవ వనరులు ఉమ్మడి హారము (common denominator ). పరిశ్రమల అవసరాలకనుగుణంగా మన ప్రజలకు విద్య మరియు శిక్షణ అందించకపోతే, మనం సమస్యలలో చిక్కుకుంటాము. ఈ సమస్యకు పలు పరిష్కారాలు వున్న నేపథ్యం లో ఈ సమస్య అనవసరమైనది.

దాని పేరుకు తగ్గట్టుగా QCI వాసి, విశ్వాసం మరియు నమ్మకపు పునాదులు తయారుచెయ్యడం ద్వారా Skill India వంటి గాఢవాంఛగల పథకాల రూపకల్పన కు దోహదపడుతుంది. ఇదే వ్యవస్థను కార్పొరేట్ రంగం మరియు విద్యా రంగాలు రాబోయే తరం లో ఉన్నత నైపుణ్యం, ఉన్నత బాధ్యత వహించే ఉద్యోగస్తులు మరియు వ్యవస్థాపకులకు శిక్షణ ఇవ్వడానికి వినియోగిస్తారు. వీరు నవీకరణ, పెరుగుదల మరియు వ్యాపార సామర్థ్య ఉత్కృష్టత లకు దోహదం చేస్తారు.

ఈ విధంగా మనం ఒక రాష్ట్ర నిర్మాణం చేపడతాము: పునాదుల నుంచి పైకి. గుణవత్థా సే ఆత్మనిర్భరత ఒక నినాదం కాదు, ఇది ఒక ప్రతిజ్ఞ. ఉన్నత ప్రమాణాలు కల విద్య మరియు శిక్షణ మరింత మంది యువత కు అందుబాటులోకి తేవడం ద్వారా భారతదేశం ప్రపంచపు రాబోయే శక్తి గృహంగా తప్పక ఉద్భవించే వీలు కల్పించగలము.

First published:

Tags: Business, Msme, Skill India, Skills, Small business

ఉత్తమ కథలు