హోమ్ /వార్తలు /బిజినెస్ /

Life Insurance: ఒక్కసారి ఈ ప్రీమియంలో చేరితే.. నెలనెలా ఆదాయమే..!

Life Insurance: ఒక్కసారి ఈ ప్రీమియంలో చేరితే.. నెలనెలా ఆదాయమే..!

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన పాలసీ.

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన పాలసీ.

ప్రముఖ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (Life Insurance) సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఒక కొత్త స్కీమ్‌ (Scheme)ను ప్రవేశపెట్టింది. పాలసీదారులు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా మ్యాక్స్ (Max) లైఫ్ స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్‌ ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఒక కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. పాలసీదారులు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను(Short Term Financial Goals) చేరుకునేందుకు వీలుగా మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్‌(Max Life Smart Fixed-return Digital Plan)ను లాంచ్ చేసింది. దీనికి కనీస పాలసీ కాల వ్యవధి ఐదేళ్లుగా పేర్కొంది. ఈ స్కీమ్‌ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవింగ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. మాక్స్ లైఫ్ స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్ ప్రయోజనాలను పొందడానికి పాలసీదారులు రూ.3,000 కంటే తక్కువ నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకున్న Policybazaar.comలో కూడా ఈ ఇన్సూరెన్స్‌ పథకం అందుబాటులో ఉంటుంది.

ఈ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌కు సంబంధించి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఓ ప్రకటనలో..‘కస్యూమర్ ఇన్‌సైట్ స్టడీ ఆధారంగా అభివృద్ధి చేసిన ఆఫర్ కస్టమర్లు ఐదేళ్ల కనీస పాలసీ వ్యవధితో స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. ఈ ప్లాన్ 6.14 శాతం వరకు గ్యారెంటీలో పన్ను రహిత రాబడిని అందిస్తుంది. అలాగే ఈ స్కీమ్‌ను నెలవారీ ప్రీమియం రూ.3000తో, మ్యాక్స్‌ లైఫ్‌ వెబ్‌సైట్, పాలసీబజార్.కామ్‌లో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్ త్వరిత, అవాంతరాలు లేని ఆన్‌బోర్డింగ్‌ను ఇష్టపడే మిలీనియల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ స్కీమ్ సంప్రదాయ పొదుపు సాధనాలతో పోలిస్తే అధిక రాబడిని అందిస్తూ, పన్ను రహిత ఆదాయం, జీవిత బీమా రక్షణ కవరేజీని అందిస్తుంది. తక్కువ వయసు ఉన్న వినియోగదారులు ఒకే ప్రొడక్ట్‌ ద్వారా సేవింగ్స్‌, ప్రొటెక్షన్‌ వంటి ద్వంద్వ ప్రయోజనాలను ఆస్వాదించడానికి వీలు ఉంటుంది’ అని పేర్కొంది.

ఇదీ చదవండి: శాశ్వత సైనిక నియామకాల కోసం అగ్నివీరులకు నిరంతర పరీక్షలు.. లెఫ్టినెంట్ జనరల్ కీలక ప్రకటన


మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్ ఫీచర్లు

మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, వాటిలో కొన్ని ఇవి..


  1.  సులువైన ఆన్‌ బోర్డింగ్‌ ప్రక్రియ, జర్నీ పూర్తయిన వెంటనే ఇన్‌స్టంట్‌ కన్‌ఫర్మేషన్‌

  2. మెచ్యూరిటీ సమయంలో ఒకే మొత్తంగా నగదు చెల్లించేందుకు హామీ

  3. కేవలం ఐదేళ్ల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రీమియం చెల్లించే వెసులుబాటు

  4. విభిన్న ఆర్థిక భద్రత అవసరాలకు అనుగుణంగా, వేర్వేరు వేరియంట్‌ల మధ్య సెలక్ట్ చేసుకొనే ఆప్షన్‌

  5. ఎంచుకున్న లక్ష్యాల ప్రకారం చెల్లించిన అధిక ప్రీమియంలకు అధిక ప్రయోజనాలు


ఈ ప్లాన్ గురించి మాక్స్ లైఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి.విశ్వానంద్ మాట్లాడుతూ..‘కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా ప్రొడక్ట్‌లను డెవలప్ చేయడంపై మాక్స్ లైఫ్ దృష్టి ఉంటుంది. మార్కెట్‌లో వినూత్నమైన, డిజిటల్ ఎనేబుల్డ్ ఫ్లెక్సిబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులను పరిచయం చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో అగ్రస్థానంలో ఉన్న పన్ను రహిత రాబడితో స్వల్పకాలిక హామీ ఉన్న ప్రొడక్ట్‌ను కోరుకునే వారి కోసం ఈ స్కీమ్‌ తీసుకొచ్చాం. సులభమైన లిక్విడిటీ, చురుకైన ఆన్‌బోర్డింగ్ కలయిక ఈ ప్రొడక్ట్‌ను మిలీనియల్స్ సేవింగ్స్‌ జర్నీలో విలువైనదిగా చేస్తుంది.’ అని వివరించారు. మ్యాక్స్‌ లైఫ్‌ స్మార్ట్ ఫిక్స్‌డ్-రిటర్న్ డిజిటల్ ప్లాన్ మిలీనియల్స్ అవసరాలను తీర్చగలదని Policybazaar.com సీఈఓ సర్బ్‌వీర్ సింగ్ తెలిపారు.

First published:

Tags: Insurance, Life Insurance, Scheme, Term insurance

ఉత్తమ కథలు