Home /News /business /

Life Insurance: సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీ.. లైఫ్ కవర్‌తో పాటు ఆదాయాన్ని కూడా సమకూర్చుతుంది..

Life Insurance: సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీ.. లైఫ్ కవర్‌తో పాటు ఆదాయాన్ని కూడా సమకూర్చుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీమా ప్రయోజనాలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చాలనుకునే వినియోగదారుల కోసం సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సంస్థ తాజాగా కాంప్రహెన్సివ్, నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది.

ఇంకా చదవండి ...
బీమా ప్రయోజనాలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చాలనుకునే వినియోగదారుల కోసం సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సంస్థ తాజాగా కాంప్రహెన్సివ్, నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది. ఈ ప్లాన్ పాలసీదారుల కుటుంబ ఆర్థిక అవసరాలు తీరుస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనికి ‘మాక్స్ లైఫ్ స్మార్ట్ వెల్త్ ఇన్‌కమ్ ప్లాన్’ (Max Life Smart Wealth Income Plan) అని పేరు పెట్టారు. వినియోగదారుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా, వారు ఎంత కాలం ఈ పథకంలో ఉండాలనుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీర్చుకునే విధంగా అదనపు ఆదాయ ఆఫ్షన్లు, లైఫ్ కవర్, ఇన్‌కమ్ ఆఫ్షన్లు ఇందులో ఉన్నాయి.

Online Money Earn: ఆన్‌లైన్‌లో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించాలా..? వాటికి ఇవే వెబ్‌సైట్లు..


తాము కొత్తగా తీసుకువచ్చిన మాక్స్ లైఫ్ స్మార్ట్ వెల్త్ ఇన్‌కమ్ ప్లాన్.. జీవితకాలం ఆర్థిక రక్షణ అందించే సమగ్రమైన పథకమని చెప్పారు మాక్స్ లైఫ్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి. ఇది భద్రత, అస్యూరెన్స్, విశ్వసనీయతతో కూడిన సరళమైన పాలసీ అని తెలిపారు. దీర్ఘకాలంలో వినియోగదారులకు ఈ పాలసీ భద్రత, భరోసా అందిస్తుందన్నారు. ఈ పాలసీ నవంబర్ 11 నుంచి అందుబాటులోకి వచ్చింది.

పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు

1. మాక్స్ లైఫ్ స్మార్ట్ వెల్త్ ఇన్‌కమ్ పాలసీలో వినియోగదారుల అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. ఎర్లీ ఇన్‌కమ్, గ్యారంటీడ్ మనీ బ్యాక్‌తో ముందస్తు ఆదాయం, డిఫర్డ్ ఇన్‌కమ్.. వంటి ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిని గ్యారంటీ మనీ బ్యాక్ రూపంలో ఇన్‌బిల్డ్ హామీలతో అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో క్యాష్ బోనస్ ఆప్షన్‌ను కూడా సంస్థ అందిస్తుంది.

2. ముందస్తు ఆదాయం, డిఫర్డ్ ఆదాయం వేరియంట్లలో 25 సంవత్సరాలకు ఆదాయ హామీ లభిస్తుంది. లేదంటే పాలసీ వ్యవధి ముగిసే వరకు ఏది తక్కువైతే అది లభిస్తుంది. గ్యారంటీ మనీ బ్యాక్‌తో ముందస్తు ఆదాయాన్ని పాలసీలో వివరించినట్టుగా 3 గ్యారంటీడ్ మనీ బ్యాక్ ఆప్షన్ల రూపంలో చెల్లిస్తారు.

3. సర్వైవల్ ప్రయోజనాలను (Cash bonus, Guaranteed) అవసరాన్ని బట్టి పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా ఎంచుకోవచ్చు. క్యాష్ బోనస్, గ్యారంటీ ఆదాయాన్ని పాలసీదారుడు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు.

Wife: నా భర్తను విడిచిపెట్టండంటూ.. తన కొడుకుతో అడవి బాట పట్టిన భార్య.. ఏం జరిగిందంటే..


4. పాలసీ వ్యవధిలో సర్వైవల్ ప్రయోజనాలు తీసుకోకుండా ఉంటే పాలసీదారుడు చనిపోయినప్పుడు లేదా మెచ్యూరిటీ తరువాత ఈ మొత్తం చెల్లిస్తారు. సర్వైవల్ ప్రయోజనాలకు రిజర్వ్ బ్యాంక్ ఏటా ప్రకటించే రివర్స్ రెపో రేటుకు సమానమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. రెపో రేటును ఆర్బీఐ ఏటా సమీక్షిస్తుంది.

5. సరళమైన మార్గంలో ఆదాయం పొందడంతో పాటు 75, 85, 100 సంవత్సరాల వరకు లైఫ్ కవర్ ప్రయోజనాన్ని ఈ పాలసీ అందిస్తుంది.

6. వినియోగదారులు తక్కువ ప్రీమియం చెల్లించడంతో పాటు, రైడర్లు ఎంచుకోవడం ద్వారా ఎక్కువ కవరేజీ పొందవచ్చు. పాలసీ ప్రయోజనాల కొనసాగింపు ఆధారంగా సర్వైవల్, మెచ్యూరిటీ ప్రయోజనాలు అందిస్తుంది. ఒక వేళ బీమా చేసి వ్యక్తి మరణిస్తే, ఆ తరువాత ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండానే ప్రయోజనాలు పొందవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Insurence

తదుపరి వార్తలు