గతవారం నుంచి కొత్త జీఎస్టీ (GST)రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇటీవల సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్ జీఎస్‌టీ పరిధిలోకి మరికొన్ని వస్తుసేవలను తీసుకొచ్చింది. రూ.5,000 కంటే ఎక్కువ అద్దె ఉండే ఆసుపత్రి గదులపై 5 శాతం జీఎస్‌టీ (GST) విధిస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లకు మినహాయింపు ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన నిబంధనలతో రోగులకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు ఈ పన్నును మొత్తం బిల్లు మొత్తంలో భాగంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే రూమ్ రెంట్ సబ్-లిమిట్‌లతో ప్లాన్‌లను తీసుకొని ఉన్న పాలసీదారులు ప్రభావితమవుతారు.
దీనిపై డిజిట్ ఇన్సూరెన్స్‌లోని అపాయింటెడ్ యాక్చువరీ నిఖిల్ కమ్దార్ మాట్లాడుతూ..‘హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు ప్రభావితం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పాలసీకి గది అద్దెపై ఎటువంటి పరిమితులు లేకపోతే ఇన్సూరెన్స్ సంస్థ సాధారణంగా వర్తించే విధంగా (GST ఛార్జీలతో సహా) క్లెయిమ్‌ను చెల్లిస్తుంది’ అని చెప్పారు.
వయో వర్గాలలో మొత్తం హెల్త్ (Health)ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా మరింత పెరగవచ్చు. పాలసీ హోల్డర్ పరంగా, మొత్తం ఆసుపత్రి బిల్లులో గది అద్దె 15-20 శాతం వరకు అధిక ప్రీమియంలకు దారి తీస్తుందని ACKO ఇన్సూరెన్స్ EVP, యాక్చువరీ, అండర్ రైటింగ్ బీరేష్ గిరి చెప్పారు.
రూమ్ రెంట్ సబ్-లిమిట్ పాలసీలపై ప్రతికూల ప్రభావం
ఆస్పత్రి రూమ్ రెంట్‌లపై జీఎస్‌టీ కారణంగా పాలసీదారులకు అధిక ఖర్చు అవుతుంది. MediAssist TPA, CEO, హోల్ టైమ్ డైరెక్టర్ సతీష్ గిడుగు మాట్లాడుతూ..‘ఇంతకుముందు, ఆరోగ్య సంరక్షణ జీఎస్‌టీ పరిధి నుండి బయటపడింది. ఆసుపత్రి గది అద్దెపై 5 శాతం విధించడం వల్ల రూమ్ రెంట్ సబ్ లిమిట్ నిబంధనతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్న పాలసీదారులకు హాస్పిటల్ స్టేయింగ్ ఖర్చు పెరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు జీఎస్‌టీ ట్యాబ్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇది జరుగుతోంది’ అని చెప్పారు. అటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో ప్రపోర్షనేట్ డిడక్షన్ నిబంధన దీనికి కారణం. అన్ని ఇతర ఛార్జీలు (కన్సల్టేషన్ రుసుము, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు వంటివి) గది అద్దెకు లింక్ చేయడంతో.. మొత్తం బిల్లు పెరుగుతుంది. అర్హత ఉన్న మొత్తం క్లెయిమ్ మొత్తం ప్రపోర్షనల్‌గా తగ్గుతుంది.
ప్రపోర్షనేట్ డిడక్షన్ క్లాజ్
గది అద్దె పరిమితులతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎటువంటి పరిమితులు లేని వాటి కంటే చౌకగా ఉంటాయి. అయితే అలాంటి పాలసీలను తీసుకొని ఉంటే.. సబ్ లిమిట్‌లు ఉండటంతో చెల్లించే క్లెయిమ్ మొత్తం వాస్తవ బిల్లు మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. గది అద్దె పేర్కొన్న పరిమితిని మించి ఉంటే, వైద్యుల ఫీజు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు మొదలైనవాటి సహా ఆమోదం పొందిన క్లెయిమ్ మొత్తం ప్రపోర్షనల్లీ తగ్గుతుంది.
ఉదాహరణకు.. పాలసీ కవరేజీ రూ.5 లక్షలు, రూమ్ రెంట్ సబ్ లిమిట్ హామీ మొత్తంలో 1 శాతం (అంటే రూ.5,000) అనుకొంటే.. రూ.6,000 రోజువారీ గది అద్దెతో ఆసుపత్రిలో చేరితే.. చివరి బిల్లు రూ. 1.5 లక్షలు వస్తుంది. బిల్లు మొత్తం ఇన్సూరెన్స్ మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపోర్షనల్లీ డిడక్షన్ నిబంధన కారణంగా జేబులో నుంచి రూ.30,000 వరకు చెల్లించాల్సి రావచ్చు. పాలసీలోని గది అద్దె ఉప పరిమితి నిబంధనకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీ రూ.1.2 లక్షల క్లెయిమ్‌ను మాత్రమే ఆమోదిస్తుంది. పాలసీ క్యాప్ కంటే గది అద్దె 20 శాతం ఎక్కువగా ఉన్నందున, లింక్ చేసిన ఖర్చుల క్లెయిమ్ మొత్తం ప్రపోర్షనల్లీ 20 శాతం తగ్గుతుంది.
పాలసీదారులు ఏం చేయవచ్చు?
ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతిపాదనను ఆమోదిస్తే.. సబ్ లిమిట్ లేకుండా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. లేదా పోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నవారు లేదా నెగిటివ్ హెల్త్ హిస్టరీ ఉన్నవారు అటువంటి పాలసీలను సరసమైన ప్రీమియంలతో కొనుగోలు చేయడం కష్టంగా ఉండవచ్చు.
నేడు విక్రయిస్తున్న చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు గది అద్దె క్యాపింగ్ లేదని, పాలసీదారుడు ఎటువంటి గరిష్ట గది అద్దె పరిమితి లేకుండా చికిత్స కోసం ఆసుపత్రిలో తమకు నచ్చిన గదిని పొందవచ్చని Policybazaar.com హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ ఛబ్రా చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Claim, GST, Health Insurance, Health policy