GST Revenue collection for Dec 2021: డిసెంబర్ లో మరోసారి లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు...
(ప్రతీకాత్మక చిత్రం)
. డిసెంబర్ 2021 కలెక్షన్లను చూస్తే, గత సంవత్సరం డిసెంబర్ కన్నా13శాతం పెరిగింది. మరోవైపు, డిసెంబర్ 2019తో పోలిస్తే ఈసారి 26% ఎక్కువ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబరు 2021లో సైతం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు పైగా ఉన్నాయి.
కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోంది. వరుసగా జీఎస్టీ కలెక్షన్లు గత ఆరు నెలలుగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే జూలై 2021 నుంచి డిసెంబర్ వరకూ వరుసగా నమోదైన జీఎస్టీ కలెక్షన్లు లక్ష కోట్లను దాటేశాయి. డిసెంబర్ 2021 కలెక్షన్లను చూస్తే, గత సంవత్సరం డిసెంబర్ కన్నా13శాతం పెరిగింది. మరోవైపు, డిసెంబర్ 2019తో పోలిస్తే ఈసారి 26% ఎక్కువ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబరు 2021లో సైతం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు పైగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఇది డిసెంబర్ 2021లో రూ.1,29,780 కోట్లుగా ఉంది. ఇది నవంబర్ 2021 నాటికి రూ. 1.31 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇందులో కేంద్ర జీఎస్టీ (CGST) కింద రూ.22,578 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) కింద రూ.28,658 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.69,155 కోట్లు అందాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. IGST దిగుమతులపై వసూలు చేసిన 37,527 కోట్ల రూపాయల సుంకాన్ని కలిగి ఉంది. అదే సమయంలో ప్రభుత్వానికి సెస్ రూపంలో రూ.9,389 కోట్లు రాగా, అందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై సెస్ ద్వారా రూ.614 కోట్లు వచ్చాయి.
GSTకి సంబంధించిన సాధారణ ప్రక్రియగా IGST నుండి రూ.25,568 కోట్ల CGST , రూ.21,102 కోట్ల SGSTని ప్రభుత్వం సెటిల్ చేసింది. దీని తర్వాత, డిసెంబర్ 2021లో, CGST నుండి ప్రభుత్వానికి మొత్తం ఆదాయం రూ. 48,146 కోట్లు , SGST నుండి రూ. 49,760 కోట్లు.
దిగుమతులపై ఆదాయాలు 36% పెరిగాయి
డిసెంబర్ 2020తో పోల్చితే డిసెంబర్ 2021లో ప్రభుత్వ GST సేకరణ 13% పెరిగింది , డిసెంబర్ 2019 కంటే 26% పెరిగింది. అదే సమయంలో, డిసెంబర్ 2021 లో, ప్రభుత్వ ఆదాయం దిగుమతులపై సుంకం నుండి 36% పెరిగింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.