గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GST చెల్లించేవారికి శుభవార్త. జీఎస్టీ చెల్లించే కస్టమర్లు రూ.1 కోటి వరకు లాటరీలో గెలుచుకునే అవకాశం కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. కస్టమర్లు ప్రతీ కొనుగోలుపై బిల్ అడగడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. అసోచాం ఈవెంట్లో పాల్గొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సభ్యులు జాన్ జోసెఫ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పన్ను చెల్లించే కస్టమర్లు లాటరీ గెలవడం ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. "జీఎస్టీ ఉన్న ప్రతీ బిల్లు ప్రైజ్ మనీ గెలుచుకునే లాటరీ లాంటిది. ఆ బిల్లు లక్కీ డ్రాకు వెళ్తుంది. కస్టమర్లు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు గెలుచుకునే అవకాశం లభిస్తుంది" అని జోసెఫ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% చొప్పున నాలుగు శ్లాబ్స్ ఉన్నాయి. జీఎస్టీ పోర్టల్‌లో అప్లోడ్ అయ్యే ప్రతీ బిల్ లాటరీకి వెళ్తుంది. డ్రా తర్వాత విజేతలకు సమాచారం అందిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, జీఎస్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నడుస్తుంది. అయితే ఎన్ని రూపాయల బిల్లులను లాటరీలోకి తీసుకుంటారన్నది నిర్ణయించాల్సి ఉంది. కస్టమర్ వెల్ఫేర్ ఫండ్ నుంచి విజేతలకు ప్రైజ్ మనీ అందజేస్తారు.
ఇవి కూడా చదవండి:
Airtel Plans 2020: ఎయిర్‌టెల్‌లో ఈ ప్లాన్స్‌తో ఇన్స్యూరెన్స్ ఫ్రీ
Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్ పేలో డబ్బులు సేఫ్
Income Tax: జీతం ఎక్కువైనా పన్ను కట్టేది తక్కువే... కొత్త విధానాన్ని అర్థం చేసుకోండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:February 05, 2020, 10:53 IST