ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ ఫైలింగ్ (GST Filing) గడువు తేదీ పెరిగింది. జీఎస్టీఆర్-3బీ (GSTR-3B) జీఎస్టీ ఫారమ్‌ను ఫైల్ చేయడానికి గడువును మే 24 వరకు ప్రభుత్వం పొడిగించింది.
ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ ఫైలింగ్ (GST Filing) గడువు తేదీ పెరిగింది. జీఎస్టీఆర్-3బీ (GSTR-3B) జీఎస్టీ ఫారమ్‌ను ఫైల్ చేయడానికి గడువును మే 24 వరకు ప్రభుత్వం పొడిగించింది. జీఎస్టీ పోర్టల్‌లో ఒక సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగా ఈ తేదీని పొడగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్(Central Board Of Indirect Taxes) & కస్టమ్స్ (CBIC) సంస్థ వెల్లడించింది. ఈ సాంకేతిక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం(Government) ఇన్ఫోసిస్ (Infosys)ను ఆదేశించింది. జీఎస్టీ పోర్టల్, ఐటీ పోర్టల్‌తో సహా ప్రభుత్వ ట్యాక్స్ పోర్టల్‌లను నిర్వహించే బాధ్యత సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ప్రభుత్వం కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2022 జీఎస్టీఆర్-2బీ, పోర్టల్‌లో జీఎస్టీఆర్-3బీ ఆటో-పాపులేషన్లో(Population) సాంకేతిక లోపం ఉందని ఇన్ఫోసిస్ కనుగొన్నట్లు సీబీఐసీ తెలిపింది. “జీఎస్టీ పోర్టల్‌లో ఏప్రిల్ 22 జీఎస్టీఆర్-2బీ & జీఎస్టీఆర్-3బీ ఆటో-పాపులేషన్లో సాంకేతిక లోపం ఉందని ఇన్ఫోసిస్ కనిపెట్టింది.
దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇన్ఫోసిస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ఫోసిస్ సాంకేతిక బృందం జీఎస్టీఆర్-2బీ & సరైన ఆటో-పాపులేటెడ్ జీఎస్టీఆర్-3బీని వీలైనంత త్వరగా అందించే పనిలో నిమగ్నమైంది" అని సీబీఐసీ ఒక ట్వీట్లో పేర్కొంది.
“ఏప్రిల్ 2022 నెలలో తమ జీఎస్టీఆర్-3బీని ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశముంది. అందుకే ఏప్రిల్ 2022 సంబంధించి ఫారమ్ జీఎస్టీఆర్-3బీని ఫైల్ చేయడానికి గడువు తేదీని మే 24, 2022 వరకు ప్రభుత్వం పొడిగించింది. QRMP పథకం కింద ఏప్రిల్, 2022కి సంబంధించిన పన్ను చెల్లింపు గడువు తేదీని GST PMT-06 ఫారమ్‌లో 27 మే, 2022 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని సీబీఐసీ మరో ట్వీట్లో పేర్కొంది.
A technical glitch has been reported by @Infosys_GSTN in generation of April 22 GSTR-2B & auto-population of GSTR-3B on portal. Infosys has been directed by Govt for early resolution.Technical team is working to provide GSTR-2B &correct auto-populated GSTR-3B at the earliest(1/2)
జీఎస్టీఆర్-2బీ స్టేట్మెంట్ సాధారణంగా నెలలో 12వ రోజున వ్యాపారాలకు అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగా చెల్లింపుదారులు పన్నులు చెల్లించేటప్పుడు, జీఎస్టీఆర్-3బీ ఫైల్ చేస్తున్నప్పుడు ఐటీసీని క్లెయిమ్ చేస్తారు. వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారుల కోసం ప్రతి నెల 20, 22, 24 మధ్య అస్థిరమైన పద్ధతిలో జీఎస్టీఆర్-3బీ ఫైల్ చేయడానికి వీలు కల్పిస్తారు.
A technical glitch has been reported by @Infosys_GSTN in generation of April 22 GSTR-2B & auto-population of GSTR-3B on portal. Infosys has been directed by Govt for early resolution.Technical team is working to provide GSTR-2B &correct auto-populated GSTR-3B at the earliest(1/2)
అసంపూర్తిగా ఉన్న జీఎస్టీఆర్-2బీపై రెండు రోజుల క్రితం జీఎస్టీ నెట్వర్క్ (GSTN) ఒక అడ్వైజరీ జారీ చేసింది. అనంతరం సాంకేతిక లోపం బయటపడింది. “ఏప్రిల్ 2022కి సంబంధించిన జీఎస్టీఆర్-2బీ స్టేట్మెంట్లో నిర్దిష్ట రికార్డులు లేవని తెలిసింది. జీఎస్టీఆర్-2ఏలో మాత్రం ఈ రికార్డులు కనిపించాయి. పన్ను చెల్లింపుదారుల కోసం ఈ సమస్యను పరిష్కరించడానికి.. తాజా జీఎస్టీఆర్-2బీని వీలైనంత త్వరగా రూపొందించడానికి సాంకేతిక బృందం పని చేస్తోంది,” అని జీఎస్టీ నెట్వర్క్ అడ్వైజరీలో పేర్కొంది. "ఆ సమయంలోగా జీఎస్టీఆర్-3బీని ఫైల్ చేయడానికి ఆసక్తి ఉన్న పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఆర్-2ఏ ని ఉపయోగించి స్వీయ-అసెస్మెంట్ ఆధారంగా రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు" అని జీఎస్టీ నెట్వర్క్ తెలిపింది. జీఎస్టీ వ్యవస్థను నిర్మించడానికి, నిర్వహించడానికి 2015లో ప్రభుత్వం ఇన్ఫోసిస్ కు రూ.1,380 కోట్ల కాంట్రాక్టును ఇచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తరచుగా జీఎస్టీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను రిపోర్ట్ చేస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.