news18-telugu
Updated: June 24, 2019, 5:51 PM IST
Electric Vehicles: తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు... కారణమిదే
(ప్రతీకాత్మక చిత్రం)
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశముంది. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్నుల్ని తగ్గించే ఆలోచనలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభకు వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ వేసిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల్ని తగ్గించే అంశం జీఎస్టీ కౌన్సిల్ దగ్గర పెండింగ్‌లో ఉందని, త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారాయన. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యల్ని తీసుకుంటోంది. పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు ఫాస్టర్ అడాప్షన్ & మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్-FAME స్కీమ్ కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం FAME-II స్కీమ్‌లో ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు భారీ సబ్సిడీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల్ని కూడా తగ్గిస్తే సేల్స్ పెరిగే అవకాశముంది.
ఇక జీఎస్టీ పరిధిలో ట్యాక్స్ ఫైల్ చేసే వారి సంఖ్య పెరిగిందని, కొత్త పన్నుల విధానంపై ప్రజల నమ్మకం పెరిగిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. గత నెలలోనే 21 లక్షల ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారని చెప్పారు. గతేడాది ఏప్రిల్-మే మాసాలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో పన్నులు 8.5 శాతం పెరిగాయి. 2018-19 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నులు రూ.11,37,685 కోట్లు కాగా, 2017-18 సంవత్సరంలో రూ.10,02,037 కోట్లు అని, ట్యాక్స్-జీడీపీ శాతం 5.86 శాతం నుంచి 5.98 శాతానికి పెరిగిందని రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇక 2017-18 జీఎస్టీ వసూళ్లు రూ.4,42,561 కాగా, 2018-19 సంవత్సరంలో రూ.5,81,563 కోట్లు.
Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్
ఇవి కూడా చదవండి:
Good News: పెరిగిన కేబుల్ ధరలపై దృష్టిపెట్టిన ట్రాయ్
48 MP Smartphone: రూ.20,000 లోపు 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్లు ఇవే...Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా
Published by:
Santhosh Kumar S
First published:
June 24, 2019, 5:51 PM IST