Petrol Diesel: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్.. మరోసారి తెరపైకి రానున్న ప్రతిపాదన

ప్రతీకాత్మక చిత్రం

Petrol Diesel: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే మార్గమనే అభిప్రాయం చాలాకాలంగా వ్యక్తమవుతోంది.

  • Share this:
    పెట్రోల్, డీజిల్ ధరలు అంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం ఒక కారణమైతే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై విధించే పన్నులు మరో కారణం అనే విషయం బహిరంగ రహస్యమే. పన్నుల విధానాన్ని సరళతరం చేస్తూ కొన్నేళ్ల క్రితం జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. దీని నుంచి పలు ఉత్పత్తులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అందులో మద్యంతో పాటు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు ద్వారా వచ్చే ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే రాష్ట్రాలు.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తాము భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. దీంతో కేంద్రం కూడా దీన్ని పక్కనపెట్టింది. అయితే తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి రానుంది. ఈ శుక్రవారం లక్నోలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు. దీంతో ఈ భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే మార్గమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత జూన్‌లో దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టు ఓ పిల్ విచారణ సందర్భంగా కేంద్రాన్ని కోరింది. కోర్టు సూచన నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదనను చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    2017, జూలై 1న జీఎస్టీ విధానం తీసుకొచ్చిన సమయంలో పెట్రోల్, డీజిల్, సహస ఇంధనం, క్రూడ్ ఆయిల్, ఏటీఎఫ్ వాటిని దీని నుంచి మినహాయించారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో భారీ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమనే నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టసాధ్యమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం కారణం కేంద్రం, రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని చెబుతున్నారు.

    Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

    స్థానికంగా పెట్రో ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ద్వారా వచ్చే పన్నులు రాబడి పొందే గుజరాత్ వంటి రాష్ట్రం కూడా బాగానే నష్టపోతుంది. దీని కారణంగా పెట్రోల్‌పై విధించే రూ. 32.80 ఎక్సైజ్ డ్యూటీ, డీజిల్‌పై విధించే రూ. 31.80లో చాలావరకు నష్టపోవాల్సి ఉంటుంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే కేంద్ర, రాష్ట్రాలు సగం సగం ఆదాయాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. 20 నెలల తరువాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వర్చువల్‌గా కాకుండా ఎప్పటిలాగే సమావేశం కావడం ఇదే తొలిసారి. కరోనా లాక్‌డౌన్ మొదలుకాకముందు డిసెంబర్ 18, 2019న చివరిసారి ఈ రకమైన భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావడంపై చర్చ జరిగినా.. ఇప్పటికిప్పుడు దీనిపై ఏకాభిప్రాయం రావడం కష్టమేననే వాదన వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: