GST Council Meet: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు...హోటల్ గదులు ఇకపై కారు చౌక...

కెఫెన్ తో కూడిన బేవరేజస్ పై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసకున్నారు. అలాగే మెరైన్ ఇంధనం పై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించారు. అయితే సవరించిన జీఎస్టీ రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 10:29 PM IST
GST Council Meet: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు...హోటల్ గదులు ఇకపై కారు చౌక...
నిర్మలా సీతారామన్ (Image : PTI)
  • Share this:
గోవాలో భేటీ అయిన 37వ జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు వస్తువులు, సేవలకు చెందిన జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. జీఎస్టీ తగ్గించిన సేవల్లో హోటల్ రూమ్  సేవలపై జీఎస్టీ భారీగా తగ్గించారు. ఇందులో భాగంగా హోటల్ గది అద్దె రూ. 7500 దాటిన గదులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అలాగే రూ.1000 పైన ఉన్న హోటల్ గదులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. అలాగే ఇక హోటల్ టారిఫ్ రూ.1000 నుంచి రూ.7500 మధ్య ఉన్న హోటల్ గదులపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే డైమండ్స్ పై 5 శాతం నుంచి 1.5 శాతం కు తగ్గించారు. ప్లాటినం దిగుమతి చేసుకొని వాటితో ఆభరణాలు రూపొందించి ఎగుమతి చేస్తే జీఎస్టీ నుంచి మినహాయింపు నిచ్చారు.

అలాగే కెఫెన్ తో కూడిన బేవరేజస్ పై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసకున్నారు. అలాగే మెరైన్ ఇంధనం పై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించారు. అయితే సవరించిన జీఎస్టీ రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు