కోవిడ్-19 (Covid-19) కారణంగా గత రెండేళ్లలో లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ పై నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. అయితే కరోనా విజృంభన తర్వాత ప్రజల్లో వచ్చిన మార్పుల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) పాలసీలు భారీగా పెరిగాయని రీసెంట్ ఎస్‌బీఐ రీసెర్చ్ (SBI Research) రిపోర్టు వెల్లడించింది. FY21లో, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు 28.5% పెరిగి రూ.26,301 కోట్లకు చేరాయని.. ఏప్రిల్ 2021 - జనవరి 2022 మధ్య రిటైల్ హెల్త్ పాలసీలు 17.28%, గ్రూప్ పాలసీలు 30.1% వృద్ధి నమోదు చేశాయని రిపోర్టు పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టాక, ఏజెంట్లు యాక్టివ్ కావడంతో జీవిత బీమా కంపెనీలు ఫిబ్రవరిలో న్యూ బిజినెస్ ప్రీమియం (NBP)లో భారీ వృద్ధిని నమోదు చేశాయని ఇది తెలిపింది.
PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారా? వివరాలు ఇలా సరిదిద్దుకోండి
ప్రధానంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ (ఎల్‌ఐసీ) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) వల్ల ఫిబ్రవరిలో ఎన్‌బీపీలో గ్రూప్ సింగిల్ ప్రీమియంలలో 40% వృద్ధి నమోదయింది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫిబ్రవరిలో న్యూ బిజినెస్ ప్రీమియంలో 22.47 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.27,464 కోట్లకు చేరుకున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. Ecowrap టైటిల్ తో పబ్లిష్ అయిన ఈ నివేదిక... ఎల్‌ఐసీకి చెందిన ఎన్‌బీపీ (NBP) 35.4 శాతం వృద్ధితో రూ. 17,849.34 కోట్లకు... ప్రైవేట్ బీమా సంస్థలు 5 శాతం వృద్ధితో రూ. 9,975 కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది.
ఉమెన్ పార్టిసిపేషన్
నివేదిక ప్రకారం... 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో విక్రయించిన మొత్తం పాలసీల్లో మహిళలు కొనుగోలు చేసిన పాలసీల సంఖ్య మొత్తం భారతదేశ సగటు 33 శాతం కంటే ఎక్కువగా ఉంది. FY21లో మహిళలకు జారీ చేసిన పాలసీల సంఖ్య దాదాపు 93 లక్షలకు చేరుకుంది.
డెత్ క్లెయిమ్‌లు
లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ చెల్లించే డెత్ క్లెయిమ్‌లు FY21లో 40.8 శాతం పెరిగి రూ.41,958 కోట్లకు చేరాయి. వ్యక్తిగత జీవిత బీమా వ్యాపారం విషయానికొస్తే... FY21 సమయంలో, జీవిత బీమా సంస్థలు 10.84 లక్షల క్లెయిమ్‌లను చెల్లించాయి. ఆ విధంగా వీటి టోటల్ బెనిఫిట్ అమౌంట్ 46.4 శాతం వృద్ధితో రూ. 26,422 కోట్లకు చేరుకుంది. డెత్ క్లెయిమ్‌ల టికెట్ సైజు FY20లో రూ.2.13 లక్షలతో పోలిస్తే, FY21లో రూ. 2.44 లక్షలకు పెరిగింది. కోవిడ్-19 సమయంలో పెరిగిన మరణాల కారణంగా మరణ దావాల పెరుగుదల కనిపిస్తోంది.
డిజిటల్ అమ్మకం
ఆన్‌లైన్, వెబ్ అగ్రిగేటర్ల ద్వారా విక్రయించే పాలసీల వాటా ప్రీమియం విలువ పరంగా కేవలం 1.9 శాతం, పాలసీల సంఖ్య పరంగా 1.6 శాతం మాత్రమే ఉందని నివేదిక పేర్కొంది.
బీమా డిమాండ్
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) వంటి సార్వత్రిక బీమా పథకాలతో, ఇన్సూరెన్స్ పాలసీలకు FY15 నుంచి డిమాండ్ బాగా పెరగడం ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.