news18-telugu
Updated: November 24, 2020, 1:36 AM IST
నిర్మల సీతారామన్ (Image;ANI)
Budget 2021–22 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టే చాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలతో పాటు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి, పెరిగిపోతున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. అయితే బడ్జెట్ అంటే అన్ని రంగాల నుంచి ఆర్థిక మంత్రికి తమ వినతులను ఇవ్వడం ఆనవాయితీ అయితీ ఈ సారి కోవిడ్ నేపథ్యంలో రానున్న బడ్జెట్‌పై వివిధ రంగాల్లో నిపుణులైన ప్రజల నుంచీ సలహాలను తీసుకోడానికి ప్రభుత్వ 'MyGov.in' పోర్టల్‌ను వేదికగా వినియోగించుకోనున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకూ ఈ పోర్టల్ ప్రజా సూచలనకు అందుబాటులో ఉంటుందని ఆర్థికశాఖ ప్రకటన తెలిపింది.
సాధరణ ప్రజలు తమతమ వ్యక్తిగత హోదాల్లో 'MyGov.in' పోర్టల్‌లో తమ పేరును నమోదుచేసుకుని 2021–22 బడ్జెట్‌కు సంబంధించి తమ సలహాలను సమర్పించవచ్చు. ఆయా సూచనలు, సలహాలను సంబంధిత మంత్రిత్వశాఖలు, విభాగాలూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని ప్రకటన వివరించింది. తమకు అందిన సూచనలు, సలహాలపై అధికార వర్గాలు ఏదైనా వివరణ కోరదలిస్తే, సూచలను చేసిన నిర్దిష్ట వ్యక్తులను ఈ మెయిల్ లేదా ఫోన్ నెంబర్ (రిజిస్ట్రేషన్ సమయంలో వారు సమర్పించిన) ద్వారా సంప్రదిస్తారని కూడా ఆర్థికశాఖ తెలియజేసింది.
Published by:
Krishna Adithya
First published:
November 24, 2020, 1:36 AM IST