• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GREEN ORANGE OR RED THESE COLOURS WILL REFLECT IF A HEALTH INSURANCE PLAN IS SIMPLE OR COMPLEX SS GH

Health Insurance: ఇక హెల్త్ పాలసీలకు కలర్ కోడ్స్... ఎందుకంటే

Health Insurance: ఇక హెల్త్ పాలసీలకు కలర్ కోడ్స్... ఎందుకంటే

Health Insurance: ఇక హెల్త్ పాలసీలకు కలర్ కోడ్స్... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance | మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? త్వరలో హెల్త్ పాలసీలకు కలర్ కోడ్స్ వస్తాయి. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
కోవిడ్–19 ప్రభావంతో హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలకు ప్రాధాన్యత పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఆరోగ్య బీమాను మరింత కస్టమర్ ఫ్రెండ్లీగా చేయడానికి సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఐఆర్‌డీఏఐ. దీనిలో భాగంగా ఆరోగ్య బీమా సంస్థలు అందజేసే ప్రతీ హెల్త్ స్కీమ్‌కు త్వరలో కలర్ కోడింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ కలర్ కోడ్‌లు హెల్త్ పాలసీ యొక్క కాంప్లెక్సిటీ, పరిధిని సూచిస్తాయి. గ్రీన్ కలర్‌లో ఉంటే సింపుల్ ప్రోడక్ట్, ఆరెంజ్ కలర్‌లో ఉంటే మోడరేట్ ప్రోడక్ట్, రెడ్ కలర్‌లో ఉంటే కాంప్లెక్స్ ప్రోడక్ట్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే ఈ కలర్ కోడింగ్ విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో అమలు చేశారు. దీనిలో హైరిస్క్, లోరిస్క్ అనే లేబుళ్లను జతచేసింది. ఇదే విధానాన్ని హెల్త్ పాలసీలకు కూడా వర్తింపజేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI నిర్ణయించింది. ఈ కొత్త విధానం ద్వారా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ సరళంగా ఉందా లేదా సక్లిష్టంగా ఉందా అనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాక, ఇన్స్యూరెన్స్ ప్లాన్‌కు సంబంధించిన నియమనిబంధనల ఆధారంగా ఆయా హెల్త్ ప్లాన్‌లకు స్కోర్ ఇవ్వబడుతుంది.

Poco C3: అతితక్కువ ధరకే 4GB + 64GB స్మార్ట్‌ఫోన్... పోకో సీ3 రిలీజ్

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

దీనిలో భాగంగా సింపుల్, మోడరేట్, కాంప్లెక్స్ అనే మూడు క్యాటగిరీల్లో ఐఆర్డీఏఐ పరిధిలోని అన్ని ఇన్స్యూరెన్స్ ప్లాన్లను విభజిస్తారు. దీనికి గాను ఆప్షనల్ కవర్స్, కో–పే పర్సంటేజ్, వెయిటింగ్ పీరియడ్, శాశ్వత మినహాయింపులు, ట్రీట్మెంట్ల సంఖ్య మరియు నిబంధనల సరళీకరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని స్కోరును నిర్ణయిస్తారు. 2 లేదా అంతకంటే తక్కువ స్కోరు కలిగిన ఇన్స్యూరెన్స్ ప్లాన్లు ఆకుపచ్చగా వర్గీకరించబడతాయి, 2 కంటే ఎక్కువ 4 కన్నా తక్కువ స్కోరు ఉన్న ప్లాన్లు నారింజ రంగులో ఉంటాయి, 4 నుంచి 6 వరకు ఉన్న ప్లాన్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఆప్షనల్ కవర్ల సంఖ్య సహ-చెల్లింపు శాతం ఎక్కువగా ఉంటే స్కోరు కూడా ఎక్కువగా ఉంటుంది.

Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

ఉదాహరణకు, ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రోడక్ట్‌కి 5 ఆప్షనల్ కవర్స్ ఉంటే, ప్రతి ఆప్షనల్ కవర్‌కి 0.6 స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంబంధిత ఇన్స్యూరెన్స్ పాలసీ స్కోరు 3 అవుతుంది. అదేవిధంగా, 5 శాతంలోపు సహ చెల్లింపులో ప్రతి 1 శాతం పెరుగుదలకు 0.3 స్కోరు ఇవ్వబడుతుంది, ఇది గరిష్టంగా 6 స్కోరుకు లోబడి ఉంటుంది. మల్టిపుల్ ఆప్షన్స్ విషయంలో, ఆప్షన్ల యొక్క సగటు మాత్రమే పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఒక హెల్త్ ప్రోడక్ట్కు 10 శాతం మరియు 20 శాతం కో–పే ఆప్షన్లు ఉంటే, అప్పుడు యావరేజ్ కో–పే 15 శాతంగా ఉంటుంది. ఈ కలర్ కోడింగ్ స్కీంపై అక్టోబర్ 15 లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఐఆర్‌డీఏఐ తమ వాటాదారులను కోరింది.
Published by:Santhosh Kumar S
First published: