Greaves Scooter | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యాంపియర్ కంపెనీ ఈ కొత్త ఇస్కూటర్‌ను (e-Scooter) తీసుకువచ్చింది. దీని పేరు యాంపియర్ ప్రీమస్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీ ఉంది. ఈ స్కూటర్ (Scooter) టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు. కేవలం ఐదు సెకన్లలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ ఏకంగా 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ స్కూటర్‌లో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, సిటీ, పవర్, రివర్స్ అనేవి ఇవి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, ఫోన్ యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో లాంగర్ లెగ్ రూమ్, వైడర్ సీట్లు వంటి ప్రత్యేకతలు ఈ స్కూటర్ సొంతం. ఈ స్కూటర్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. హిమాలయన్ వైట్, రాయల్ ఆరెంజ్, హవెలాక్ బ్లూ, బక్ బ్లాక్ వంటి రంగుల్లో లభిస్తుంది. ఇంకా డ్యూయెల్ టోన్ రంగులో కూడా ఈ స్కూటర్ లభిస్తుంది.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. పండుగ ముందు దిగివచ్చిన గోల్డ్ రేట్లు!
అలాగే కంపెనీ మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఆవిష్కరించింది. యాంపియర్ ఎన్ఎక్స్‌జీ, యాంపియర్ ఎన్‌ఎక్స్‌యూ అనేవి ఇవి. ఇవి రెండూ కనెక్టెడ్ స్కూటర్. అంతేకాకుండా కంపెనీ మరో మూడు ఎలక్ట్రిక్ త్రి వీలర్లను కూడా లాంచ్ చేసింది. గ్రీవ్స్ ఈఎల్‌పీ, గ్రీవ్స్ ఈఎల్‌సీ, గ్రీవ్స్ ఏరో విజన్ అనేవి ఇవి. ఆరు కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రి వీలర్లను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.
బ్యాంక్ కస్టమర్లకు కేంద్రం అదిరే గుడ్ న్యూస్.. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలపై భారీ ఆఫర్లు!
Greaves embarks on an ambitious electric future with a cool design theme that's not restricted to private vehicles. Futuristic scooter concepts NXG (personal) and NXU (cargo), plus all-new Primus - its first LFP battery scooter@ampere_ev pic.twitter.com/0aoGOlGyG9
— Girish Karkera (@Karkeragirish) January 11, 2023
కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నెలకొంది. వీటి అమ్మకాలను చూస్తే.. డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్, హీరో వంటి పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌పై కన్నేశాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లపై లోన్ ఆఫర్లు ఉన్నాయి. ఈజీ ఈఎంఐతో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయొచ్చు. ఓలా, ఏథర్ వంటి కంపెనీలు వాటి మోడళ్లపై ఈజీ లోన్, ఈజీ ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి. దీని కోసం కంపెనీలు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto expo, Electric Scooter, Electric Vehicles, Ev scooters, SCOOTER