news18-telugu
Updated: August 4, 2019, 6:47 PM IST
Good News: హైదరాబాద్‌లో 50 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
(ప్రతీకాత్మక చిత్రం)
ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి, కొనాలనుకునేవారికి శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్-GHMC నగరంలో 50 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్-EESL సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 50 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతోంది జీహెచ్ఎంసీ. ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరుగుతోంది. కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త మోడల్స్ తీసుకొస్తుండటం, కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ఛార్జింగ్ సమస్యలు ఉంటాయన్న ఆందోళన వాహనదారుల్లో ఉంది. ఇలా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తే ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరిగే అవకాశముంది.
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్-TSRTC నిర్వహణలో eBuzz K9 బస్సులు నడుస్తున్నాయని ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన Olectra-BYD వెల్లడించిన విషయం తెలిసిందే. 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, మరో 35 బస్సులు కూడా వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని Olectra Greentech కంపెనీ BYD ఆటో ఇండస్ట్రీ కంపెనీతో కలిసి ఇండియాలో తయారు చేస్తోంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్-FAME-I స్కీమ్‌లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనేందుకు ఒక్కో బస్సుకు రూ.1 కోటి వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. 39+1 సీట్స్ కెపాసిటీ ఉన్న ఈ బస్సులు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తుంటాయి.
Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు
ఇవి కూడా చదవండి:
Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?
IRCTC: ఐఆర్సీటీసీ నుంచి కొడైకెనాల్ టూర్... ప్యాకేజీ వివరాలివేWhatsApp: వాట్సప్, ఇన్స్టాగ్రామ్ పేర్లు మారబోతున్నాయి... కొత్త పేర్లేంటో తెలుసా?
Published by:
Santhosh Kumar S
First published:
August 4, 2019, 6:47 PM IST