• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GRAND FINALE OF 50 CITIES R ELAN RUN TO MAKE INDIA LITTER FREE BA

50 నగరాలతో R|Elan గ్రాండ్ ఫైనల్స్... చెత్త రహిత భారత్ కోసం...

50 నగరాలతో R|Elan గ్రాండ్ ఫైనల్స్... చెత్త రహిత భారత్ కోసం...

కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుతో R|Elan బృందం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన బట్టను తయారు చేస్తుంది.

  • Share this:
    భారత్‌ను చెత్తరహిత దేశంగా మార్చేందుకు R|Elan చేపట్టిన రన్ విజయవంతం అయింది. రీపు దమన్‌తో కలసి 50 నగరాల ప్రజలు ఈ రన్‌‌లో పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన R|Elan సంస్థకు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనస్వాగతం లభించింది. ప్లాస్టిక్ బాటిళ్లను ఏరివేసే కార్యక్రమం R|Elan ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న కొచ్చిలో ప్రారంభమైంది. అనంతరం అది ముంబై, హైదరాబాద్, కోల్‌కతా లాంటి నగరాల్లో సాగింది. సుమారు 1000 కిలోమీటర్ల దూరం 50 నగరాల్లో ఈ రన్ కొనసాగింది. సుమారు 2.7 టన్నుల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ప్రజల్లో ఆరోగ్యం మీద పర్యావరణం మీద అవగాహన కల్పించేందుకు రీతు దమన్ కొత్త ఫార్ములాతో ముందుకొచ్చారు. జాగింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తే సేకరిస్తారు. అలాంటి రీతు దమన్‌తో R|Elan జతకట్టింది. ఈ మెగా రన్ నిర్వహించింది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన బట్టను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్లాంట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో ఉంది. ప్రతి ఏటా ఈ యూనిట్ 2.5 బిలియన్ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేస్తుంది. దీన్ని పర్యావరణహితమైన గ్రీన్ గోల్డ్ ఫైబర్‌గా మారుస్తుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు