ఇప్పుడు సంపాదిస్తున్నదాంట్లో కొంత దాచుకొని భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? అయితే ఇండియా పోస్ట్ (India Post) అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. ప్రైవేట్ సంస్థలు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లో దాచుకునే డబ్బులు సురక్షితంగా ఉంటాయన్నది వాస్తవం. రిటర్న్స్ కాస్త తక్కువగా ఉన్న మీ డబ్బుకు భరోసా ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే పథకాలు కాబట్టి ఎలాంటి ఢోకా ఉండదు. ఇండియా పోస్ట్ నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ 'గ్రామ సురక్ష స్కీమ్' (Gram Suraksha Scheme) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో రోజూ రూ.50 అంటే నెలకు రూ.1,500 చొప్పున దాచుకుంటే మీకు రూ.31 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు రిటర్న్స్ లభిస్తాయి.
Sunny Leone: సన్నీ లియోన్ కొత్త బిజినెస్... సంపాదన పెంచుకోవడానికి నయా ఐడియా
పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష స్కీమ్ హోల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ఈ పాలసీనే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ ఇన్స్యూరెన్స్ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. పాలసీహోల్డర్ వయస్సు 19 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి. 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించొచ్చు. సమ్ అష్యూర్డ్ రూ.10,000 నుంచి రూ.10,00,000 వరకు ఎంచుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి ప్రీమియం చెల్లించొచ్చు. ప్రీమియం చెల్లించడానికి ఇన్వెస్టర్లకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
Interest Rates: ఈ బ్యాంకుల్లో రూ.1,00,000 దాచుకుంటే రూ.1,23,000 రిటర్న్స్
ఉదాహరణకు 19 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష స్కీమ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నాడనుకుందాం. 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.31.60 లక్షల రిటర్న్స్ వస్తాయి. ఆ తర్వాత మరో 5 ఏళ్లు డబ్బుల్ని అలాగే దాచుకుంటే మొత్తం రూ.34.60 రిటర్న్స్ వస్తాయి. ఈ పాలసీలో కొంతకాలం ప్రీమియం చెల్లించిన తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ చేసే అవకాశం కూడా ఉంది. పాలసీహోల్డర్లకు బోనస్ కూడా లభిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
EPFO Alert: వడ్డీ జమ చేస్తున్న ఈపీఎఫ్ఓ... పాస్‌బుక్ చెక్ చేయండి ఇలా
గ్రామ సురక్ష రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిపార్ట్‌మెంటల్ ఏజెంట్స్, డిఫెన్స్ సర్వీసుల్లో ఉన్నవారు, పరిశ్రమల్లో పనిచేసేవారు, ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నవారు, ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India post, Investment Plans, Personal Finance, Post office, Post office scheme