బీడీఎల్ సంస్థలో 15 శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం...

ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానం ద్వారా ఈ వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది.

news18-telugu
Updated: January 24, 2020, 11:08 PM IST
బీడీఎల్ సంస్థలో 15 శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన సైతం జారీ చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానం ద్వారా ఈ వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిడిఎల్‌ అత్యాధునిక గైడెడ్‌ ఆయుధ వ్యవస్థలను తయారు చేసే సత్తా ఉంది. ప్రస్తుతం బిడిఎల్‌ లో కేంద్ర ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. అయితే బిడిఎల్‌ వాటా విక్రయం రానున్ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ముగియవచ్చని అంచనా వేస్తున్నారు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు