Pearl Farming: గిరిజన ప్రాంతాల్లో ముత్యాల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి.. ప్రాజెక్టు కోసం ప్రైవేటు సంస్థతో ట్రైఫెడ్ ఒప్ప?

Pearl Farming: గిరిజన ప్రాంతాల్లో ముత్యాల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి..

గిరిజన ప్రాంతాల్లో ముత్యాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్యూర్టీ అగ్రెటెక్ కృషి చేస్తుంది. ఒప్పందంలో భాగంగా ఉత్పత్తి చేసిన ప్య

  • Share this:
దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను అన్వేషిస్తోంది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ముత్యాల ఉత్పత్తిలో వారిని భాగస్వామ్యం చేయడంతో పాటు, వాటిని దేశ వ్యాప్తంగా ఉన్న ట్రైబ్స్ ఇండియా అవుట్‌లెట్ల ద్వారా అమ్మాలని భావిస్తోంది. ఇందులో భాగంగా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ట్రైఫెడ్ (ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా).. సోమవారం జార్ఖండ్‌కు చెందిన ప్యూర్టీ అగ్రోటెక్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన ప్రాంతాల్లో ముత్యాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్యూర్టీ అగ్రెటెక్ కృషి చేస్తుంది. ఒప్పందంలో భాగంగా ఉత్పత్తి చేసిన ప్యూర్టీ అగ్రోటెక్ ముత్యాలను 141 ట్రైబ్స్ ఇండియా అవుట్‌లెట్‌లతో పాటు వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా అమ్మనున్నారు.

ముత్యాల ఉత్పత్తిలో భాగంగా ప్యూర్టీ అగ్రోటెక్‌కు చెందిన కేంద్రాన్ని ‘వన్ ధన్ వికాస్ కేంద్ర క్లస్టర్’ (VDVKC) గా అభివృద్ధి చేస్తారు. జార్ఖండ్‌లో ముత్యాల ఉత్పత్తి కోసం మొత్తం 25 వరకు VDVKC లను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ముత్యాలు లభించే గుల్లలు లేదా ఆల్చిప్పల (oysters) పెంపకం, ముత్యాల అభివృద్ధి, మార్కెటింగ్ ప్రక్రియను స్థిరమైన వ్యాపార విధానంగా మార్చాలని కేంద్ర గిరిజన శాఖ భావిస్తోంది. ఇందుకు నీటి వనరుల దగ్గర జీవనం సాగించే గిరిజనులను ముత్యాల ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించనట్లు ట్రైఫెడ్ అధికారులు తెలిపారు. దీనిపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పరివర్తన కార్యక్రమాల్లో ఇది ఒకటని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు గిరిజనుల జీవనోపాధికి భరోసా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సహజమైన 'వన్ ధన్' ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, అమ్మకాలను పెంచడానికి ట్రైఫెడ్ కృషి చేస్తోంది. ఇందుకు ఈ-కిరాణా ప్లాట్‌ఫాం బిగ్ బాస్కెట్‌తో ఒక అవగాహన ఒప్పందం సైతం కుదుర్చుకుంది. గిరిజన, అటవీ ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ట్రైఫెడ్‌కు సంబంధించిన రెండు కొత్త వెంచర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నవరత్నాల్లో ఒకటైన ముత్యాలు ఆల్చిప్పల్లో లభ్యమవుతాయి. ఆల్చిప్పల ద్వారా సహజమైన ముత్యాలను ఉత్పత్తి చేసే ప్రక్రియను భారత్‌లో చాలామంది అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రక్రియను గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని ట్రైఫెడ్ నిర్ణయించింది.
Published by:Krishna Adithya
First published: