బంగారం హాల్ మార్కింగ్ స‌క్సెస్‌.. స‌మ్మె విర‌మించుకోండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బంగారం హాల్ మార్కింగ్ విధానం విజయవంతం అయ్యిందని కావున... ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న ఆల్ ఇండియా జెమ్ అండ్ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

 • Share this:
  ప్ర‌భుత్వం జూలైలో ప్ర‌వేశ పెట్టిన బంగారం హాల్ మార్కిగ్ విధానం వ్య‌తిరేకిస్తూ ఆల్ ఇండియా జెమ్ అండ్ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ఆగ‌స్టు 23న స‌మ్మెను త‌ల‌పెట్టింది. దీనిపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ప్ర‌మోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ హాల్ మార్క్ విధానం విజయ‌వంతం అయ్యింద‌ని కావున స‌మ్మె విర‌మించుకోవాల‌ని కోరారు.
  బంగారం హాల్ మార్కింగ్ విధానం అంటే..
  హాల్​మార్కింగ్​ అనేది బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​ (బీఐఎస్​) దీన్ని పర్యవేక్షిస్తుంది. ఆభరణాలపై హాల్​మార్కింగ్​ ఉంటే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం చేసుకోవాలి. కేంద్రం ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన విధానంలో రూ.40ల‌క్ష‌ల లోపు ట‌ర్నోవ‌ర్ ఉన్న‌వారు మిన‌హా మిగ‌తా షాపులు హాల్ మార్కింగ్ ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే విక్ర‌యించాలి. అది కూడా దేశంలో 256 జిల్లాలు.. అస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్ల (AHC)లో మాత్రమే ఈ హాల్​మార్కింగ్ విధానం అమ‌లులో ఉంటుంది. దీనిపై బంగారు వ్యాపారులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.
  కోటి న‌గ‌ల‌కు హాల్ మ‌ర్కింగ్ చేశాం..
  దేశంలో బంగారు న‌గ‌ల‌కు హాల్ మార్కింగ్ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కోటి న‌గ‌ల‌కు హాల్ మార్కింగ్ చేసిన‌ట్లు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ప్ర‌మోద్ కుమార్ తివారీ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 90 వేల మంది న‌గ‌ల వ్యాపారులు దీని కింద పేర్లు న‌మోదు చేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది జూలై 1, 2021 నుంచి ఆగ‌స్టు 20, 2020 వ‌ర‌కు 1.02కోట్ల న‌గ‌ల‌కు హాల్ మార్కింగ్ చేసిన‌ట్టు ధ్రువీక‌రించారు. ఈ విధానం అమ‌లైన నెల జూలై 1-15 మ‌ధ్య‌లో 5,145మంది వ్యాపారులు మార్కింగ్‌కు పంప‌గా ఆగ‌స్టు 1-15 మ‌ధ్య‌లో 14,349 వ్యాపారులు పంపిన‌ట్టు తెలిపారు. ఈ విధానం చాలా మంది ఆమోదిస్తున్న‌ట్టు తెలిపారు. జూలై 15 వ‌ర‌కు 14.28 ల‌క్ష‌ల హాల్ మార్క్ న‌గ‌ల అమ్మితే.. ఆగ‌స్టు 1 నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు 41.81 ల‌క్ష‌ల హాల్ మార్క్ న‌గ‌లు అమ్మిన‌ట్టు తెలిపారు.
  ప్ర‌స్తుతం 256 జిల్లాలో మాత్ర‌మే హాల్ మార్కింగ్ వేఏ కేంద్రాలు ఉన్నాయ‌ని అన్నారు. ఆ జిల్లాలో 853 కేంద్రాల్లో కేవ‌లం 161 కేంద్రాల్లో మాత్ర‌మే రోజుకు 500 పేగా న‌గ‌లు వ‌స్తున్న‌ట్లు ప్ర‌మోద్ కుమార్ తివారీ వెల్ల‌డించారు. మ‌రో 300 కేంద్రాల‌కు రోజువారీగా వ‌చ్చే న‌గ‌లు 100 లోపే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం రోజూ 4 ల‌క్ష‌ల న‌గ‌ల‌కు ఈ మార్కింగ్ వేస్తున్న‌ట్లు చెప్పారు. అందువ‌ల్ల ర‌ద్దీ కార‌ణంగా ఇబ్బందులు ఎదుర‌వుతున్న ప‌రిస్థితులు లేవ‌న్నారు. ఈ ప‌థ‌కం విజ‌య‌వంతమైంద‌ని దీని వ‌ల్ల అటు వినియోగ దారుల‌కు , ఇటు వ్యాపారుల‌కు ప్ర‌యోజ‌నం అన్నారు. అందువ‌ల్ల ఈ నెల 23న వ్యాపార వ‌ర్గాలు త‌ల‌పెట్టిన ఆల్ ఇండియా జెమ్ అండ్ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) నిర్ణ‌యించిన దేశ వ్యాప్త స‌మ్మెను విర‌మించుకోవాల‌ని కోరారు.
  Published by:Sharath Chandra
  First published: