డిస్కౌంట్స్ ఇవ్వడానికి మీరెవరు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై కేంద్రం ఫైర్..

Amazon | Flipkart | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం షాక్ ఇచ్చింది. డిస్కౌంట్లు ఇవ్వడానికి మీరెవరు అంటూ ఈ రెండు సంస్థలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆఫర్లు దోపిడీని తలపిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.

news18-telugu
Updated: October 18, 2019, 4:48 PM IST
డిస్కౌంట్స్ ఇవ్వడానికి మీరెవరు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై కేంద్రం ఫైర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ అమెజాన్, బిగ్ దివాళి సేల్ అంటూ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించాయి. సాధారణంగా లభించే రేటు కన్నా అతి తక్కువ రేట్లకే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్, సెల్‌ఫోన్లు లభించడంతో ప్రజలు ఉత్సుకత చూపించారు. ఆఫర్ అయిపోతుందేమోనన్న ఆత్రుతతో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. ఫెస్టివల్ సీజన్‌లో ఈ రెండు సంస్థలు 3 బిలియన్ డాలర్లు సంపాదించాయని.. ఈ మొత్తం ఆ సంస్థలు ఏడాదిలో జరిపే అమ్మకాల్లో 50 శాతం అని ఒక అంచనా. అయితే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం షాక్ ఇచ్చింది. డిస్కౌంట్లు ఇవ్వడానికి మీరెవరు అంటూ ఈ రెండు సంస్థలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆఫర్లు దోపిడీని తలపిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ‘ఆఫర్లు ప్రకటించడానికి ఈ కామర్స్ సంస్థలకు ఎలాంటి అధికారం లేదు. రిటైల్ రంగాన్ని నష్టాల్లో పడేసేలా ఉత్పత్తులు అమ్మడానికి అనుమతి లేదు’ అని ఆయన మీడియాతో తెలిపారు. ఆ కంపెనీలు సొంత ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా అధికారం లేదని వెల్లడించారు. ఈ కామర్స్ సంస్థలు కేవలం కొనుగోలుదార్లకు, అమ్మకం దార్లకు మధ్య సహాయకారి మాత్రమేనని వివరించారు.

అయితే.. ఈ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించి.. ఉత్పత్తులను అమ్ముతున్నాయని కొంతమంది ట్రేడర్లు ఫిర్యాదు చేయడంతో వాణిజ్య మంత్రి ఈ మేరకు ఆయా సంస్థలపై విచారణకు ఆదేశించారు. త్వరలోనే ఆయా సంస్థలకు నోటీసులు అందజేస్తామని స్పష్టం చేశారు. గతంలోనూ ఈ సంస్థలను హెచ్చరించినట్లు గుర్తు చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు