ఇక కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లకు సులువుగా క్లియరెన్స్

చిరువ్యాపారాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అప్రూవల్స్, క్లియరెన్సుల సంఖ్యను భారీగా తగ్గించాలనుకుంటోంది.

news18-telugu
Updated: June 20, 2019, 4:55 PM IST
ఇక కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లకు సులువుగా క్లియరెన్స్
ఇక కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లకు సులువుగా క్లియరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఒక కిరాణా షాపు తెరవడానికి కావాల్సిన క్లియరెన్స్‌ల సంఖ్య 28. టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన అప్రూవల్స్ సంఖ్య 17. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నుంచి ఫుడ్ రెగ్యులేటర్ నుంచి క్లియరెన్స్ వరకు అన్ని అప్రూవల్స్ ఉంటే తప్ప కిరాణాషాపులు, రెస్టారెంట్లు తెరవడం సాధ్యం కాదు. ఇలాంటి చిరువ్యాపారాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అప్రూవల్స్, క్లియరెన్సుల సంఖ్యను భారీగా తగ్గించాలనుకుంటోంది. సింగిల్ విండో క్లియరెన్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోబోతోంది.

లైసెన్స్ రెన్యువల్‌ను తొలగించడం ద్వారా ప్రభుత్వ సిబ్బంది, అధికారుల జోక్యానికి కత్తెర వేయలని డిపార్ట్‌మెంటల్ ఫర్ ప్రమోషనల్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్-DPIIT భావిస్తోంది. సింగపూర్, చైనా లాంటి దేశాల్లో రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే నాలుగు క్లియరెన్సులు చాలు. ఇదే విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన సమావేశంలో పారిశ్రామికవర్గాలు ప్రస్తావించాయి.

రెస్టారెంట్ ఓనర్లకు చట్టాలు అవరోధంగా మారాయి. జాతీయ స్థాయిలో రెస్టారెంట్లకు ఒకే తరహా నిబంధనలు ఉంచలేరా? మేం రోజంతా జిరాక్సులు తీసుకుంటూ ఉండాల్సి వస్తోంది. ఒక రాష్ట్రంలో కాదు ప్రతీ నగరంలో, మున్సిపాలిటీల్లో రెస్టారెంట్లకు నిబంధనలు మారుతున్నాయి.

రాహుల్ సింగ్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే ఇలాంటి రంగాల్లో అప్రూవల్స్‌ను వీలైనంత తగ్గించాలని నిర్ణయించింది. DPIIT ఈ మేరకు కసరత్తు చేపట్టింది.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Budget 2019: రైతులకు వడ్డీ లేకుండా రూ.1 లక్ష రుణం... బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

WhatsApp: వాట్సప్‌లో ఫోటోలు పంపుతున్నారా? కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్
First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>