హోమ్ /వార్తలు /బిజినెస్ /

Govt imposes stock limits: పప్పు ధాన్యాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్న కేంద్రం... ఏం చేస్తోందంటే?

Govt imposes stock limits: పప్పు ధాన్యాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్న కేంద్రం... ఏం చేస్తోందంటే?

కేంద్రం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద ఒక్కో రకం పప్పు ధాన్యం 200 టన్నులకు మించి స్టాక్‌ ఉండకూడదు. రిటైలర్‌ దగ్గర ఒక్కో రకం పప్పు ధాన్యం గరిష్ఠంగా ఐదు టన్నులు మాత్రమే ఉండాలి. మిల్లర్ల దగ్గరకు వచ్చేసరికి గత చివరి మూడు నెలల ఉత్పత్తి లేదా వార్షిక సామర్థ్యంలో 25 శాతంలో ఏది ఎక్కువైతే అది పరిమితి‌గా ఉంటుంది.

ఇంకా చదవండి ...

  ఆకాశాన్నంటుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీని కోసం స్టాక్‌కు పరిమితిస్‌ నిర్ణయించింది. పెసరపప్పు మినహా మిగిలిన అన్ని పప్పు ధాన్యాలను స్టాక్‌ పెట్టుకునే క్రమంలో హోల్‌సేలర్స్‌, రిటైలర్స్‌, ఇంపోర్టర్స్‌, మిల్లర్ల దగ్గర అక్టోబరు వరకు ఈ స్టాక్‌ పరిమితి‌ అమలులో ఉంటుంది. ఈ మేరకు ఆహార, పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుండి జూన్‌ వరకు చూసుకుంటే... పప్పు ధాన్యాల ధరలో 20 శాతం పెరుగుదల కనిపించింది. దీంతో కేంద్రం పరిమితి‌ నిర్ణయం తీసుకుంది.

  కేంద్రం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద ఒక్కో రకం పప్పు ధాన్యం 200 టన్నులకు మించి స్టాక్‌ ఉండకూడదు. రిటైలర్‌ దగ్గర ఒక్కో రకం పప్పు ధాన్యం గరిష్ఠంగా ఐదు టన్నులు మాత్రమే ఉండాలి. మిల్లర్ల దగ్గరకు వచ్చేసరికి గత చివరి మూడు నెలల ఉత్పత్తి లేదా వార్షిక సామర్థ్యంలో 25 శాతంలో ఏది ఎక్కువైతే అది పరిమితి‌గా ఉంటుంది. ఇక దిగుమతి చేసేవాళ్లకు కూడా హోల్‌ సేల్‌ వ్యాపారుల తరహాలోనే 200 టన్నులు పరిమితిగా నిర్ణయించారు. మే 15 వరకు దిగుమతి చేసుకున్న స్టాక్‌ల విషయంలోనే ఇది వర్తిస్తుంది. మే 15తర్వాత దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాల విషయానికొస్తే... కస్టమ్స్‌ క్లియరెన్స్‌ అయ్యాక 45 రోజుల తర్వాత నుండి పరిమితి వర్తిస్తుంది.

  కేంద్రం విధించిన పరిమితులను ఎవరైనా మించి స్టాక్‌ ఉంచుకున్నట్లయితే fcainfoweb.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 30 రోజుల్లోనే స్టాక్‌ను పరిమితికి తగ్గట్టుగా ఉంచుకోవాలి. ఇటీవల కాలంలో పరిశీలిస్తే కందిపప్పు, మినపప్పు రిటైల్‌ ధరలు బాగా పెరిగిపోయాయి. జనవరిలో కిలో ₹100 ఉన్న ఈ పప్పులు ₹110కి చేరిపోయాయి. మరోవైపు మసూరు పప్పు ధర అయితే 21 శాతం పెరిగిందట. ₹70 ఉన్న మసూర్లు ₹85కి చేరుకున్నాయి. శనగపప్పు దర అయితే ₹65 నుండి 75కి చేరుకుంది. దీంతో పప్పుధాన్యాల ధాన్యాల ధరలను అదుపులో పెట్టడానికి కేంద్రం వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది. దీంతోపాటు కందిపప్పు, పెసరపప్పును ఉచితంగా దిగుమతి చేసుకునే సదుపాయం ఇచ్చింది. అందుకనుగుణంగా వీటిని పరిమిత కేటగిరీ నుండి తొలగించారు.

  మరోవైపు మయన్మార్‌, మలావి, మొజాంబిక్‌ నుండి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేలా ఐదేళ్ల కోసం ఎంవోయూ కుదుర్చుకున్నారు. అలాగే విదేశాల నుండి వచ్చే పప్పు ధాన్యాల కన్‌సైన్‌మెంట్ల క్లియరెన్స్‌ను ఏడు రోజులకు తగ్గేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రస్తుతం క్లియరెన్స్‌ సమయం 10 నుండి 11 రోజులుగా ఉంది. ఒప్పందంలో భాగంగా ఏడాదికి మయన్మార్‌ నుండి 2.5 లక్షల టన్నులు మినపప్పు, ఒక లక్ష టన్ను కందిపప్పు దిగుమతి అవుతాయి. మలావి నుండి టన్ను కందిపప్పు.. మొజాంబిక్‌ నుండి రెండు లక్షల టన్నుల కందిపప్పు దిగుమతి కానుంది.

  ఇది కూడా చూడండి..

  First published:

  Tags: Business

  ఉత్తమ కథలు