వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. హెవీ వెహికిల్స్‌కి ఆటోమేటిక్ ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి చేస్తూ విధించిన గడువును తాజాగా పొడిగించింది. భారీ సరకు రవాణా వాహనాలు, ప్యాసింజర్ మోటార్ వాహనాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల(ATS)లో ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాలని గతంలో కేంద్రం ప్రకటించింది. తాజాగా ఈ గడువును 18 నెలలకు వాయిదా వేసింది. 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏటీఎస్ కేంద్రాల్లో హెవీ గూడ్స్, ప్యాసింజర్ మోటార్ వెహికిల్స్ ఫిట్‌నెస్ టెస్ట్‌ను తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపింది.
ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు మాత్రమే
హెవీ గూడ్స్, ప్యాసింజర్ మోటారు వెహికిల్స్‌కి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు అందించే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఇకనుంచి పరిగణనలోకి తీసుకుంటామని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గతంలో తెలిపింది. 2023 ఏప్రిల్ 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది. కానీ, దేశంలో ప్రస్తుతానికి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటనతో లారీలు, ట్రక్కులు, బస్సుల యజమానులకు కాస్త ఊరట కలగనుంది.
వీటికి నో ఎక్స్‌టెన్షన్
హెవీ గూడ్స్, ప్యాసింజర్ మోటార్ వెహికిల్స్‌కి ఏటీఎస్‌లల్లో ఫిట్‌నెస్ టెస్ట్ తేదీని వాయిదా వేసినప్పటికీ మీడియం గూడ్స్, మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికిల్స్, లైట్ మోటార్ వెహికిల్స్(ట్రాన్స్‌పోర్ట్)కి తేదీని పొడిగించలేదు. గతంలో అనౌన్స్ చేసిన తేదీ నుంచే ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి చేసింది. ఈ తరహా వాహనాలు ఏటీఎస్‌లల్లో 2024 జూన్ 1 నుంచి తప్పనిసరిగా ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ లైట్ మోటార్ వెహికిల్స్(నాన్ ట్రాన్స్‌పోర్ట్)కి రిజిస్ట్రేషన్ రెన్యువల్ సమయంలో ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుందని తెలిపింది. అంటే 15ఏళ్ల తరువాత ఈ టెస్ట్‌ని చేయించుకోవాలి.
ఇక తప్పులకు నో ఛాన్స్
వాహనాలకు ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఆర్టీవో కేంద్రాల్లోనే నిర్వహించేవారు. అధికారులు వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించేవారు. ఈ ప్రాసెస్‌లో కొన్ని తప్పులు, అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. ఫలితంగా పూర్తి సామర్థ్యం లేని వాహనాలు రోడ్డుపైకి వచ్చేవి. ఇలా ఫిట్‌నెస్ లేని వాహనాల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. దీంతో మ్యాన్యువల్ ఫిట్‌నెస్ టెస్టింగ్‌కు కేంద్రం గుడ్ బై చెబుతూ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఏటీఎస్ కేంద్రాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇక తప్పులకు ఆస్కారం ఉండకుండా వాహనం పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే సర్టిఫికెట్ వస్తుంది.
వీరికి అవకాశం
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కేంద్రం 2021లోనే ఆహ్వానించింది. కంపెనీలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, అసోసియేషన్లు, ఇండివిడ్యువల్ బాడీలు, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. పర్సనల్, ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌ని పరీక్షించేందుకు ఏటీఎస్ కేంద్రాలు ఓపెన్ చేసుకునేందుకు వీటికి అనుమతినిచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.