Loan Mela: బిజినెస్ పెడుతున్నారా...లోన్‌ కావాలా...? అయితే ఇది మీకు గుడ్ న్యూస్

పండగ సీజన్ లో అక్టోబర్ 15 లోగా దేశంలోని 400 జిల్లాల్లో రెండు దశల్లో రుణ మేళాలను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు, ఇంటి కొనుగోలు దారులు, ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తలకు రుణాలు అందించాలని కేంద్రం ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశం అయ్యింది.

Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 4:19 PM IST
Loan Mela: బిజినెస్ పెడుతున్నారా...లోన్‌ కావాలా...? అయితే ఇది మీకు గుడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 4:19 PM IST
మాంద్యం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టేందుకు కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, సూక్ష్మ, చిన్నమధ్యతరహా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేందుకు కేంద్రం భారీగా రుణాలు ఇవ్వాలని తీర్మానించింది. ఇందులో భాగంగా పండగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 15 లోగా దేశంలోని 400 జిల్లాల్లో రెండు దశల్లో లోన్ మేళాలను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు, ఇంటి కొనుగోలు దారులు, ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తలకు రుణాలు అందించాలని కేంద్రం ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశం అయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యారు.

అంతేకాదు మొదటి విడతలో భాగంగా సెప్టెంబర్ 29 వరకూ 200 జిల్లాల్లో రిటైల్ వినియోగదారులు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ దారులకు రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత రెండో దశలో మరో 200 జిల్లాల్లో రుణమేళాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...