news18-telugu
Updated: November 25, 2020, 8:39 PM IST
ప్రతీకాత్మక చిత్రం
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్యాంకులు లక్ష్మీ విలాస్ బ్యాంక్, DBS Bank India Ltd (DBIL) విలీనానికి ఆమోద ముద్రవేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై 30 రోజుల మారటోరియం విధించించిన విషయం తెలిసిందే. బ్యాంక్ ఖాతాదారులు 25వేల కంటే ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ ఐతే లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను డీబీఎస్‌లో విలీనం చేయడంతో డిపాజిటర్ల విత్ డ్రాయల్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. బ్యాంకు పతనానికి కారణమైన మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని ఆర్బీసీఐని ఆదేశించినట్లు తెలిపారు.
లక్ష్మీ విలాస్ బ్యాంకులో సుమారు 20 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. 4000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారందరికీ ఇది ఊరటనిచ్చే విషయం. కాగా, లక్ష్మీ విలాస్ బ్యాంక్, డీబీఎస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్.. ఇండియన్ యూనిట్ DBILలో విలీనానికి ఆర్బీఐ ఇదివరకే అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఈ బ్యాంకుల విలీనానికి ఆమోద ముద్ర వేయడంతో.. దీంతో త్వరలోనే ఈ రెండు బ్యాంకులు కలిసి ఒక బ్యాంక్‌గా ఏర్పాటు కానుంది. లక్ష్మీ విలాస్ బ్యాంకు బ్రాంచీలన్నీ డీబీఎస్ పరిధిలోకి రానున్నాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
November 25, 2020, 8:34 PM IST