హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digi Yatra App: విమాన ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. ఇక, ఆ సర్వీస్ తో చాలా సమయం ఆదా చేసుకోవచ్చు..

Digi Yatra App: విమాన ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. ఇక, ఆ సర్వీస్ తో చాలా సమయం ఆదా చేసుకోవచ్చు..

Photo Credit : Shutterstock

Photo Credit : Shutterstock

Digi Yatra App: భారత ప్రభుత్వ డిజియాత్ర ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఢిల్లీ, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయాలు సోమవారం డిజియాత్ర యాప్ బీటా వెర్షన్‌ను సాఫ్ట్ లాంచ్‌ చేశాయి. ఈ టెక్నాలజీతో..

ఢిల్లీలోని ఇందిరా గాంధీ (Indira Gandhi) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బెంగళూరులోని కెంపేగౌడ (Kempegowda) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దేశీయ ప్రయాణికులకు తీపి కబురు అందించాయి. ఈ విమానాశ్రయాలు సోమవారం నాడు ఆండ్రాయిడ్ ఆధారిత డిజియాత్ర యాప్ (DigiYatra app) బీటా వెర్షన్‌ను లాంచ్ చేశాయి. తాజాగా లాంచ్ అయిన ఈ యాప్ సహాయంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా దేశీయ ప్రయాణికులు డిజిటల్‌గా చెక్-ఇన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌తో పేపర్-లెస్‌గా చెక్-ఇన్ పూర్తి చేసుకొని చాలా సమయం ఆదా చేసుకోవచ్చు. డిజియాత్రతో ప్రయాణికులు పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్ ద్వారా విమానాశ్రయంలోని వివిధ చెక్‌పోస్టులు కూడా దాటి వెళ్లవచ్చు.

భారత ప్రభుత్వ డిజియాత్ర ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఢిల్లీ, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయాలు సోమవారం డిజియాత్ర యాప్ బీటా వెర్షన్‌ను సాఫ్ట్ లాంచ్‌ చేశాయి. ఈ టెక్నాలజీతో విమానాశ్రయంలోని సెక్యూరిటీ చెక్, ఎయిర్‌క్రాఫ్ట్ బోర్డింగ్ వంటి చెక్‌పోస్టుల వద్ద ఫేషియల్ రిక‌గ్నెష‌న్‌ సిస్టమ్‌ ఆధారంగా ప్రయాణికుల ఎంట్రీ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. ఈ మేరకు యాప్‌కు బోర్డింగ్‌ పాస్‌ను లింక్‌ చేశారు.

ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత డిజియాత్ర ట్రయల్స్‌ను నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలో దాదాపు 20 వేల మంది ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించారు. వారెవరికీ కూడా ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురు కాలేదు. దాంతో డిజిటల్‌గానే అన్ని ప్రాసెస్‌లు పూర్తి చేసి మంచి ప్రయాణం అనుభూతిని ప్రయాణికులు ఆస్వాదించారు.

* డిజియాత్ర ఎలా పనిచేస్తుంది

డిజియాత్ర టెక్నాలజీ బోర్డింగ్ ప్రాసెస్ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. ఈ టెక్నాలజీ చెక్‌-ఇన్ పూర్తి చేయడానికి ప్రతి ప్రయాణికుడికి ప్రతి టచ్ పాయింట్ వద్ద మూడు సెకన్ల కంటే తక్కువ సమయమే తీసుకుంటుంది. ఈ టెక్నాలజీలో ప్రయాణికుల ఫేస్‌లు ID ప్రూఫ్, వ్యాక్సిన్ ప్రూఫ్, బోర్డింగ్ పాస్‌ వంటి డాక్యుమెంట్స్‌గా పని చేస్తాయి. ఎయిర్‌లైన్స్ డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్‌తో ప్రయాణికుల డేటా వెరిఫై చేయడం జరుగుతుంది కావున విమానాశ్రయంలో మెరుగైన భద్రత ఉంటుంది.

తద్వారా అర్హత ఉన్న ప్రయాణికులు మాత్రమే టెర్మినల్‌లోకి ప్రవేశించగలరు. DigiYatra యాప్ బీటా వెర్షన్ ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇదొక ఆండ్రాయిడ్ యాప్ అని గమనించాలి. ఈ యాప్ కొన్ని వారాల్లో యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : ఈఎంఐలు కట్టే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్.. లోన్‌ వడ్డీ రేట్లుపై ఇక బాదుడే.. ఎంతంటే..

ఢిల్లీలోని టెర్మినల్ 3, బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘డిజియాత్ర’ అనేది ఫేషియల్ రిక‌గ్నెష‌న్‌ టెక్నాలజీ ఆధారంగా బయోమెట్రిక్ ఎనేబుల్డ్ సీమ్‌లెస్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యం పెట్టుకుందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ విదేహ్ కుమార్ జైపురియార్ పేర్కొన్నారు.

First published:

Tags: Bengaluru, Delhi Airport, Flights

ఉత్తమ కథలు