Gold: బంగారు నగలపై కేంద్రం కీలక నిర్ణయం...ఇకపై హాల్‌మార్క్ తప్పనిసరి...

బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరిగా అమలు చేస్తామని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ మేరకు బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను వచ్చే ఏడాది జనవరి 15 న విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు.

news18-telugu
Updated: November 29, 2019, 10:11 PM IST
Gold: బంగారు నగలపై కేంద్రం కీలక నిర్ణయం...ఇకపై హాల్‌మార్క్ తప్పనిసరి...
Gold Price: (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇకపై బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరిగా అమలు చేస్తామని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ మేరకు బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను వచ్చే ఏడాది జనవరి 15 న విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు. 2020 జనవరి 15 నుంచి ఇక హాల్ మార్క్ తప్పనిసరి అని తెలిపారు. అయితే హాల్ మార్క్ అమలు కోసం వర్తకులకు ఏడాది సమయం ఇస్తున్నట్లు తెలపారు. ఈలోగా వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్ ను పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించారు. బంగారం క్రయవిక్రాయాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కస్టమర్లకు నాణ్యమైన బంగారం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>