హోమ్ /వార్తలు /బిజినెస్ /

Edible Oil: పండుగ సీజన్‌లో సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. వంట నూనెలపై కీలక ప్రకటన!

Edible Oil: పండుగ సీజన్‌లో సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. వంట నూనెలపై కీలక ప్రకటన!

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. వంట నూనెలపై కీలక ప్రకటన!

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. వంట నూనెలపై కీలక ప్రకటన!

Oil Price | వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాల రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల సరఫరా అడ్డంకులు ఉండవు. రిటైల్ ధరలు కూడా అదుపులోనే ఉండే ఛాన్స్ ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Cooking Oil| వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై రాయితీతో కూడిన దిగుమతి (Imports) సుంకాల ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది. దేశీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ (Oil price) సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

  సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్‌పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది. ‘వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాలపై రాయితీ ఆరు నెలల పాటు పొడిగించాం. అంటే దీని అర్థం ఇప్పుడు కొత్త గడువు మార్చి 2023 అని ఫుడ్ మినిస్ట్రీ వెల్లడించింద. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

  అక్టోబర్ 3 నుంచి 9 వరకు ఈ నగరాల్లో బ్యాంకులు పని చేయవు

  అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగి వచ్చాయని, అందువల్ల దేశీ మార్కెట్‌లో కూడా కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడంతో పాటు ప్రభుత్వపు సుంకాల రాయితీ వల్ల దేశంలో వంట నూనె ధరలు తగ్గాయని తెలిపింది.

  పాత ఫోన్ ఇచ్చి రూ.650 చెల్లిస్తే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం! ఆఫర్ వివరాలు ఇలా..

  నోటిఫికేషన్ ప్రకారం.. క్రూడ్ పామ్ ఆయిల్, ఆర్‌బీడీ పామోలిన్, ఆర్‌బీడీ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇదే కొనసాగుతుంది. ప్రస్తుతం పామ్ ఆయిల్ క్రూడ్ వెరైటీస్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు జీరో.

  అయితే అగ్రికల్చర్ సెస్ 5 శాతం, సోషల్ వెల్ఫేర్ సెస్ 10 శాతం వంటివి పరిగణలోకి తీసుకుంటే.. ఈ మూడు క్రూడ్ వెరైటీస్‌పై ఎఫెక్టివ్ దిగుమతి సుంకం 5.5 శాతంగా ఉంటుంది. పామోలీన్, పామ్ ఆయిల్ రిఫైన్డ్ వెరైటీస్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లు కలుపుకుంటే ఈ సుంకం 13.75 శాతానికి చేరుతుంది. రిఫైన్డ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 17.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లను కలుపుకుంటే అప్పుడు ఇది 19.25 శాతానికి చేరుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ధరలకు కళ్లెం వేయడానికి చాలా సార్లు కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Cooking oil, Edible Oil, Mustard Oil, Oil prices, Sunflower oil

  ఉత్తమ కథలు