హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Privatisation: అమ్మకానికి మరో బ్యాంక్.. ఈసారి దీని వంతు! ఖాతాదారులకు అలర్ట్..

Bank Privatisation: అమ్మకానికి మరో బ్యాంక్.. ఈసారి దీని వంతు! ఖాతాదారులకు అలర్ట్..

 అమ్మకానికి మరో బ్యాంక్.. ఈసారి దీని వంతు! ఖాతాదారులకు అలర్ట్..

అమ్మకానికి మరో బ్యాంక్.. ఈసారి దీని వంతు! ఖాతాదారులకు అలర్ట్..

PSU Banks | మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను ప్రైవేట్ పరం చేయాలని రెడీ అవుతోంది. త్వరలోనే ఈ బ్యాంక్ కూడా ప్రైవేట్ బ్యాంక్‌గా మారిపోనుంది. ఈ అంశానికి సంబంధించి దీపం కార్యదర్శి కీలక విషయాన్ని వెల్లడించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Bank News | కేంద్ర ప్రభుత్వం మరో బ్యాంక్ ప్రైవేటీకరణకు రెడీ అవుతోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ను (IDBI Bank) ప్రైవేట్ పరం చేయబోతోంది. దీపం సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై డిపార్ట్‌మెంట్ పని చేస్తోందని తెలిపారు. ఇన్వెస్ట్ల నుంచి త్వరలోనే ఇనీషియల్ బిడ్స్‌ను ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. తాము ఈ పని మీదనే ఉన్నామని, దీర్ఘకాలం నుంచి వర్క్ చేస్తూ వస్తున్నామని వివరించారు. బిడ్డింగ్ ద్వారా బ్యాంక్‌ను ప్రైవేటీకరించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి (LIC) వాటాలు ఉన్నాయి.

  బ్యాంక్ పనితీరు మెరుగు పడటం వల్ల ఈ బ్యాంక్ ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యల నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆర్‌బీఐ ఐడీబీఐ బ్యాంక్‌ను సత్వర్ దిద్దుబాటు చర్యల నుంచి 2021 మార్చిన తొలగించింది. నాలుగేళ్ల తర్వాత బ్యాంక్ ఈ ఫ్రేమ్‌వర్క్ నుంచి బయటకు రాగలిగింది. ఐడీబీఐ బ్యాంక్ మంచి పనితీరును నమోదు చేయడం ఇందుకు కారణం.

  నెలకు రూ.1,300 చెల్లిస్తే చాలు.. కొత్త బైక్ , స్కూటర్ మీ సొంతం! ఆఫర్ వివరాలు ఇలా

  2021 మే నెలలో యూనియన్ కేబినెట్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మేనేజ్‌మెంట్ కంట్రోల్ బదిలీ వంటి అంశాలకు సూత్రప్రాయ ఆమోదం ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి 49.24 శాతం మేర వాటా ఉంది. ఎల్‌ఐసీ అనేది ప్రస్తుతం ఈ బ్యాంక్ ప్రమోటర్‌గా కొనసాగుతోంది.

  గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా పడిపోయిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే!

  కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 65 వేల కోట్లు. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. మోదీ సర్కార్ ఇప్పటికే దాదాపు రూ. 24,544 కోట్లు మేర సమీకరించింది. ఇందులో చాలా వరకు ఎల్‌ఐసీ లిస్టింగ్ ద్వారానే పొందింది. ఎల్‌ఐసీ ఈ ఏడాది మే నెలలో మార్కెట్‌లో ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇకపోతే బ్యాంక్ ఉద్యోగులు ఈ ప్రైవేటీకరణ అంశంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే బ్యాంక్ ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనియన్లు ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ప్రభుత్వం ముందుకు వెలితే యూనియన్లు సమ్మెకు దిగే అవకాశాలు ఉణ్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Bank account, IDBI Bank, LIC, LIC IPO

  ఉత్తమ కథలు