Income Tax చెల్లింపుదారుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ రూపకల్పన.. త్వరలోనే అందుబాటులోకి

Tax Returns ఈ–వెరిఫికేషన్, రీఫండ్ ఎంత వరకు పూర్తయ్యిందో వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఇటువంటి అన్ని రకాల Tax సంబంధిత సేవలను ఈ నూతన మొబైల్ యాప్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు IncomeTax శాఖ తెలిపింది.

news18-telugu
Updated: October 31, 2020, 5:04 PM IST
Income Tax చెల్లింపుదారుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ రూపకల్పన.. త్వరలోనే అందుబాటులోకి
(ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
దేశంలో Tax చెల్లింపుదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఇటీవలే ఒక సరికొత్త ఈ–పోర్టల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే పన్నులకు సంబంధించి అన్ని రకాల సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో మొబైల్ యాప్ను రూపకల్పన చేయనున్నట్లు Income Tax శాఖ ప్రకటించింది. తద్వారా Tax చెల్లింపులను సలభతరం చేయడంతో పాటు బకాయిలు, Taxచెల్లింపులకు సంబంధించిన వివరాలను చెల్లింపుదారుడు సులభంగా తెలుసుకోవచ్చు. వీటితో పాటు Tax Returns ఈ–వెరిఫికేషన్, రీఫండ్ ఎంత వరకు పూర్తయ్యిందో వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఇటువంటి అన్ని రకాల Tax సంబంధిత సేవలను ఈ నూతన మొబైల్ యాప్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు IncomeTax శాఖ తెలిపింది. -వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలు, ట్రస్టులు చేపట్టే కీలకమైన ఆర్థిక లావాదేవీల వివరాలు IncomeTax విభాగం పరిధిలోనే ఉండాల్సినప్పటికీ, ఇక నుంచి ఆ వివరాలను కూడా Tax చెల్లింపుదారులతో పంచుకోనున్నట్లు Income Tax శాఖ స్పష్టం చేసింది. తద్వారా ఆయా కార్పొరేట్ కంపెనీలు, ట్రస్టులు వారి వార్షిక Taxరిటర్న్‌ను సరిగ్గా దాఖలు చేస్తాయని అభిప్రాయపడింది. వార్షిక Taxరిటర్న్లను తప్పులు లేకుండా నింపేలా వీలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

టాక్స్ రిటర్న్ లో ఏవైనా తప్పులు దొర్లితే ఆ డేటాను సవరించడానికి Tax చెల్లింపుదార్లకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. దీనికి అనుగుణంగా Income Tax రిటర్న్లను సరిగ్గా దాఖలు చేయడంలో తోడ్పడేందుకు Central Board Of Direct Taxes(సిబిడిటి) ఈ ఏడాది జూలైలో 26 ఎఎస్ పేరుతో ఒక కొత్త ఫారంను ప్రవేశపెట్టింది. నగదు డిపాజిట్లు, నగదు ఉపసంహరణ, స్థిరాస్తి క్రయవిక్రయాలు, డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, షేర్ల కొనుగోలు, డిబెంచర్లు, విదేశీ కరెన్సీ కొనుగోలు వివరాలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, షేర్ల బై బ్యాక్, వస్తువుల కొనుగోలు చెల్లింపులకు సంబంధించిన వివరాలను ఈ కొత్త ఫారంలో పొందుపర్చారు. Tax చెల్లింపుదారులు ఈ 26 ఎఎస్ ఫారమ్‌ను ఈ–-ఫైలింగ్ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చని IncomeTax శాఖ పేర్కొంది.

త్వరలోనే మొబైల్ యాప్ అందుబాటులోకి..

నూతన మొబైల్ యాప్ గురించి CBDT ఛైర్మన్ పిసి మోడి మాట్లాడుతూ, “ఆన్లైన్ ఆధారిత Tax చెల్లింపు సేవల ద్వారా సరికొత్త మార్పును చూడబోతున్నాం. ఈ నూతన ఈ–-ఫైలింగ్ పోర్టల్ వ్యక్తిగత Taxచెల్లింపుదారులకు అతని లేదా ఆమె ఆర్థిక సమాచారాన్ని పొందటానికి వీలు కల్పిస్తుంది. Taxచెల్లింపుదారుడు తాను అందజేసిన సమాచారంలో కొన్ని మార్పులను చేయడానికి ఈ–పోర్టల్ వీలు కల్పిస్తుంది. Tax చెల్లింపుదారులకు సౌకర్యంగా ఉండే ఈ నూతన మొబైల్ యాప్ను అతి తక్కువ సమయంలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే ఈ నూతన పోర్టల్‌ అందుబాటులో రానుంది." అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫేస్లెస్ టాక్స్ అసెస్మెంట్ వ్యవస్థను 2017లో ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. ఈ నూతన వ్యవస్థను 2019 జూలై 5 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొదటి బడ్జెట్లో ప్రస్తావించగా, ఇది 2019 అక్టోబర్ 7న ప్రారంభించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతో హ్యూమన్ ఇంటర్ఫేజ్ అవసరం లేకుండానే పారదర్శకంగా, అవినీతి రహితంగా Taxచెల్లింపులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యంగా ఆధాయపు Taxశాఖ పేర్కొంది.
Published by: Krishna Adithya
First published: October 31, 2020, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading