హోమ్ /వార్తలు /బిజినెస్ /

Work From Home: ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త.. వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!

Work From Home: ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త.. వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!

ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త.. వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!

ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త.. వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!

SEZ | కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్పెషల్ ఎకనమిక్ జోన్స్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Employees | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అవకాశం కల్పించాలని నిర్ణయించిందని వెల్లడించారు. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (SEZ)లోని ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆయన వివరించారు. చాలా త్రైమాసికాల నుంచి ఈ అంశానికి సంబంధించి రిక్వెస్ట్‌లు వస్తున్నాయని, ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ సంప్రదాయం వల్ల చిన్న పట్టణాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అలాగే సర్వీసుల ఎగుమతి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బోర్డు ఆఫ్ ట్రేడ్ మీటింగ్ తర్వాత ఈయన మీడియాతో మాట్లాడారు. అన్ని సెజ్ సెక్టార్లలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దీంతో సెజ్‌లలో పని చేసే ఉద్యోగులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

పెన్షనర్లకు ఊరట.. ఈరోజు నుంచి కొత్త రూల్స్, మారే 2 అంశాలివే!

మరోవైపు చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది. అయితే ఐటీ కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఆఫీస్ రప్పిస్తున్నాయి. అయితే దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మాత్రం తన ఫ్లెక్సిబుల్ వర్క ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. 2021 అక్టోబర్‌లో ఈ కంపెనీ ఉద్యోగులకు నిరవధికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ అంశంపై అమెజాన్ మరోసారి స్పందించింది. కార్పొరేట్ ఉద్యోగులను వెనక్కి పిలిచే ప్రణాళికలు ఏవీ కంపెనీ వద్ద లేవని స్పష్టత ఇచ్చింది.

ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే

మరోవైపు దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ మాత్రం వారంలో మూడు రోజులు ఉద్యోగులను ఆఫీస్‌కు రావాలని తెలిపింది. మంగళవారం, గురు వారం కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సి ఉంటుందని, ఇక మిగిలిన ఒక రోజును టీమ్ లీటర్ కేటాయిస్తారని కంపెనీ తెలిపింది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాత్రం 20 శాతం మంది ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. విప్రో కంపెనీ కూడా హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తోంది. ఉద్యోగులను ఆఫీస్‌కు రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేయలేదు. ఉద్యోగులకు ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తోంది. టెక్ మహీంద్రా ఉద్యోగుల విషయానికి వస్తే.. ఉద్యోగులను ఆఫీస్‌కు రావాల్సిందేనని తెలియజేసింది. ఇప్పుడు ఈ కంపెనీ ఉద్యోగులు ఆఫీస్‌ నుంచే పని చేస్తున్నారు. దాదాపు అన్ని ఐటీ కంపెనీలు రానున్న రోజుల్లో కూడా ఉద్యోగులు అందరినీ తిరిగి ఆఫీస్‌లకు రప్పించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

First published:

Tags: Employees, IT jobs, JOBS, Piyush Goyal, Work From Home

ఉత్తమ కథలు