సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి... కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్‌ను రద్దు చేసి పారెయ్యాలంటున్నారు. ఆయన వ్యాఖ్యలను టైమ్స్ నౌ న్యూస్ ఎక్స్‌క్లూజీవ్‌గా పబ్లిష్ చేసింది. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే తీసుకోవాల్సిన మొదటి చర్య ఇదేనని అన్నారాయన. ఇన్కమ్ ట్యాక్స్‌ను ఎందుకు రద్దు చేయాలో ఆయన తన లాజిక్‌ను కూడా వివరించారు.

వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్లు ఎలాగూ పన్నులు చెల్లించడం లేదు. ఇక అర్బన్ సెక్టార్లో నిరుపేదలు కూడా ఆదాయపు పన్ను చెల్లించరు. ఇక ధనవంతుల దగ్గర ఛార్టర్డ్ అకౌంటెంట్లు పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్లు చాలా తక్కువ పన్నులు చెల్లిస్తారు. ఇక మిగిలింది మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులే. వారికి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పన్ను వేధింపులకు గురయ్యేదివాళ్లే.
సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ నాయకుడు
ఆదాయపు పన్ను రద్దు చేయడం వల్ల ప్రజలకు మేలు చేయడం మాత్రమే కాదు... మరిన్ని లాభాలు ఉన్నాయన్నారు సుబ్రహ్మణ్యస్వామి.

కొనుగోలు శక్తి కోణంలో చూస్తే ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ చైనా, అమెరికా తర్వాతి స్థానంలో ఉంది. మన వృద్ధి రేటు 7% మాత్రమే. అది చాలదు. 10% కన్నా ఎక్కువగా ఉండాలన్నది నా అభిప్రాయం. ఇది అత్యాశ అనుకోవచ్చు. కానీ 3.5% వృద్ధి రేటు సాధిస్తే గొప్ప అని 1950, 60, 70వ దశకాల్లో అనుకున్నారు. కానీ ప్రధాన మంత్రి నరసింహారావు సంస్కరణల వల్ల 7-8% వృద్ధి రేటు అందుకోగలిగాం.
— సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ నాయకుడు
10% వృద్ధి రేటు సాధించాలంటే ఇప్పుడు ఇస్తున్న పన్ను మినహాయింపులు, ఉచితాలు ఏ మాత్రం సరిపోవన్నది సుబ్రహ్మణ్యస్వామి వాదన. అందుకే ఆదాయపు పన్ను రద్దు చేయాలని అంటున్నారాయన.
Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
Save Money: జీతం మొత్తం ఖర్చయిపోతుందా? డబ్బు ఆదా చేయడానికి 5 టిప్స్
LIC Payment: ఎల్ఐసీ ప్రీమియం కట్టడం మర్చిపోయారా? ఇలా చేయొచ్చు
PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31Published by:Santhosh Kumar S
First published:February 08, 2019, 18:29 IST