HOME »NEWS »BUSINESS »government scrappage policy for vehicles older than 15 years to be introduced soon ba

పాత బైక్‌లు, కార్లు.. ఇనుప సామాన్ల కింద అమ్ముకోవాల్సిందే.. కేంద్రం కొత్త చట్టం?

పాత బైక్‌లు, కార్లు.. ఇనుప సామాన్ల కింద అమ్ముకోవాల్సిందే.. కేంద్రం కొత్త చట్టం?
ప్రతీకాత్మక చిత్రం

మీ దగ్గర 15 సంవత్సరాల కంటే పాత బైక్‌లు, కార్లు ఉన్నాయా. మొదటి జీతంతో కొనుక్కున్న కారు, అత్తగారు పెట్టిన బైక్ వంటి సెంటిమెంట్లు పెట్టుకుని వాటిని అలాగే కాపాడుకుంటున్నారా? అయితే, మీరు అలాగే కాపాడుకోండి. కానీ, బయటకు మాత్రం తీసుకురావొద్దు.

  • Share this:
    మీ దగ్గర 15 సంవత్సరాల కంటే పాత బైక్‌లు, కార్లు ఉన్నాయా. మొదటి జీతంతో కొనుక్కున్న కారు, అత్తగారు పెట్టిన బైక్ వంటి సెంటిమెంట్లు పెట్టుకుని వాటిని అలాగే కాపాడుకుంటున్నారా? అయితే, మీరు అలాగే కాపాడుకోండి. కానీ, బయటకు మాత్రం తీసుకురావొద్దు. బయటకు తీసుకొచ్చారంటే ఇక అంతే సంగతులు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఆ చట్టం ప్రకారం 15 ఏళ్ల పైబడిన కార్లు, బైక్‌లు మొత్తం చెత్త కింద పడేయాల్సిందే. చెత్త కింద పడేయడం ఇష్టం లేకపోతే మీరు ఇనుప సామాన్లకు అమ్ముకోవాల్సిందే. కేంద్రం తీసుకురాబోయే కొత్త చట్టం గురించి ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని తెలియజేశారు. 15 ఏళ్ల కంటే పాతవైన వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. దీంతోపాటు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాలుష్యరహితమైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్తవాటికి రూట్ క్లియర్ చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది.

    భారత ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా వల్ల అన్ని రంగాలు నష్టపోయినట్టే ఆటోమొబైల్ రంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఈ క్రమంలో ఆ సెక్టార్ కేంద్ర బడ్జెట్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్ కోసం తాము చేస్తున్న కృషికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రావాలని కోరుకుంటోంది. ఆటోమొబైల్ రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చేందుకు బహుశా బడ్జెట్‌లో దీనిపై కేంద్రం ప్రతిపాదన చేసే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రతిపాదనలో ఉంది. దీనికి ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంది.



    తాము ప్రతిపాదించిన పాలసీ క్లియర్ అయితే భారత్ ఆటోమొబైల్ హబ్‌గా మారుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. పాత వాహనాలను స్క్రాప్ కింద అమ్మితే, వాటిని ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలు చేసి.. ఆ ముడిసరుకు ద్వారా కొత్త వాహనాలు తయారు చేసేందుకు వీలవుతుందని, దాని వల్ల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, ప్రపంచం వ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి స్క్రాప్ వాహనాలను తీసుకుని, దాని ద్వారా రీసైకిల్ చేసిన వాహనాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దీని వల్ల కంపెనీల మీద కూడా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. దేశంలో ఆటోమొబైల్ రంగం విలువ రూ.4.5 లక్షల కోట్లు. అందులో రూ.1.5 లక్షల కోట్లు ఎగుమతులు ఉన్నాయి.

    గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాత వాహనాల పాలసీ మీద ఓ డెసిషన్ తీసుకోవాలని అన్నారు. మరోవైపు ఇన్సెంటివ్ ఆధారిత స్కాపింగ్ పాలసీ తీసుకురావాలని, ముఖ్యంగా భారీ వాహనాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోరుతోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 16, 2021, 17:12 IST