• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOVERNMENT RELEASED COVID 19 GUIDELINES FOR POST OFFICE OPERATIONS HERE FULL DETAILS NS GH

Post Office: కరోనా ఎఫెక్ట్.. పోస్టాఫీసులకు ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్​.. వివరాలివే

Post Office: కరోనా ఎఫెక్ట్.. పోస్టాఫీసులకు ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్​.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

పోస్టల్ ఉద్యోగులు కరోనా భారీన పడటంతో ఆ శాఖ వినతి మేరకు సర్కారు కొత్త మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది. సిబ్బంది అందరికీ ఒకే పనివేళలు కాకుండా, వేర్వేరు పని వేళలు కేటాయించడానికి పోస్టల్ శాఖకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్లను ప్రకటించాయి. అయినప్పటికీ.. కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు సరికదా.. రోజురోజుకు మరిన్ని కేసులు పెరుగుతున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష కార్యకలాపాలు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందిపై కూడా కరోనా ప్రభావం పడింది. ఇటీవలి కాలంలో కొంతమంది పోస్టల్ ఉద్యోగులు కరోనా భారీన పడటంతో పోస్టల్​ శాఖ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సిబ్బంది అందరికీ ఒకే పనివేళలు కాకుండా, వేర్వేరు పని వేళలు కేటాయించడానికి పోస్టల్ డిపార్ట్​మెంట్​కు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే.. ఆయా సర్కిళ్ల పరిధిలో కరోనా తీవ్రతను బట్టి మాత్రమే ఈ చర్యలు తీసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ..  పోస్టల్ సేవలు తప్పనిసరి సేవలు కిందికి వస్తాయి. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పాక్షిక లాక్​డౌన్ లేదా ఆంక్షల సమయంలోనూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోస్టల్​ శాఖ తమ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. కరోనా తీవ్రత దృష్ట్యా సిబ్బంది పనివేళల్లో కొన్ని మార్పులు చేస్తూ పోస్టల్ సర్కిల్స్​కు మార్గదర్శకాలు జారీ చేశాం. స్థానిక పరిస్థితులను బట్టి వీటిని వీటిని అనుసరించాలని సూచించాం." అని అన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..
1) అన్ని కార్యాలయాల సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలి. తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వాడకం, మాస్క్​ ధరించడం, సోషల్​ డిస్టెన్స్​ పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలి.
2) పబ్లిక్ హాల్, కౌంటర్లు, కారిడార్లు, క్యాంటీన్లు, పార్కింగ్ మొదలైన ప్రదేశాల్లో రద్దీ లేకుండా ఆయా సర్కిళ్ల హెడ్​ ఆఫీసర్లు చూసుకోవాలి.
3) COVID-19 వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, 45 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులందరికీ వ్యాక్సిన్​ వేయవచ్చు.
4) స్థానిక కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, అధిక రద్దీని నివారించడానికి, ఉద్యోగులకు వేర్వేరు పని సమయాలను నిర్ణయించవచ్చు. కస్టమర్లు గుమికూడకుండా ఆయా సర్కిల్​ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.

5) అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసుల్లో పనిచేసే కొంతమంది సిబ్బందిని ఇంటి నుండి పని చేయడానికి అనుమతించవచ్చు. అయితే, ఇంటి నుండి పనిచేసే అధికారులు టెలిఫోన్ / ఈ–మెయిల్ మొదలైన వాటి ద్వారా అందుబాటులో ఉండాలి. అవసరాన్ని బట్టి ఆఫీసులకు రావాల్సి ఉంటుంది.
6) వీలైనంతవరకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సమావేశాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి.
7) ఎప్పటికప్పుడు ఆఫీసు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
8) ప్రభుత్వం జారీ చేసే కోవిడ్​–19 సూచనలను ఖచ్చితంగా పాటించేలా ఆయా హెడ్​ ఆఫీసర్లు తమ సిబ్బందికి దిశానిర్దేశం చేయాలి.
9) కరోనా తీవ్రత దృష్ట్యా బయో మెట్రిక్ హాజరు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. తదుపరి ఉత్తర్వుల వరకు రిజిస్టర్లలోనే సిబ్బంది హాజరును నమోదు చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు