PM Modi | సోషల్ మీడియాలో ఒక నోటీస్ తెగ వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ (Laptop) స్కీమ్ 2023 కింద అర్హత కలిగిన వారికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్ లభిస్తున్నాయని ఇందులో ఉంది. భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ (Scheme) కింద ఇంటర్, డిగ్రీ చదివే వారికి ఉచితంగా ల్యాప్‌టాప్స్ లభిస్తున్నాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లెనొవొ ఇంటెల్ సెలెరియో డ్యూయెల్ కోర్ ల్యాప్‌టాప్స్ పొందొచ్చని తెలుస్తోంది.
అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఉచిత ల్యాప్ టాప్ స్కీమ్‌లో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా అవాస్తవం. అందువల్ల ఎవరైనా ఇలాంటి మెసేజ్‌లు పొంది ఉంటే మాత్రం.. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ బెనిఫిట్ లభిస్తుందని వైరల్ అవుతోన్న నోటీసులో ఉంది. అందువల్ల మీర ఉచితంగానే ల్యాప్ టాప్ వస్తుందని రిజిస్టర్ చేసుకుంటే మాత్రం మోసపోవాల్సి వస్తుంది.
బంగారం కొనే వారికి పిడుగులాంటి వార్త.. రూ.60 వేలు దాటేసిన ధర, ఈరోజు కొత్త రేట్లు ఇలా
మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ కావొచ్చు. అందువల్ల మీ ఫోన్‌కు కూడా ఇలాంటి మెసేజ్ వస్తే.. లేదంటే మీరు ఎక్కడైనా ఇలాంటి నోటీసును గమనిస్తే.. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది పూర్తి ఫేక్. అలాగే ఆశ పడి రిజిస్టర్ చేసుకుంటే.. మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు మోసగాళ్ల చేతికి చేరే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది.
3 ఏళ్లలోనే కాసుల వర్షం.. రూ.లక్షకు రూ.83 లక్షలు!
A notice is circulating on social media that claims that the Government Of India is offering free laptops to youth under the Prime Minister Free Laptop Scheme 2023#PIBFactCheck ✔️The notice is #FAKE ✔️No such scheme is being run by the @EduMinOfIndia, GOI pic.twitter.com/YQcIk8LMYF
— PIB Fact Check (@PIBFactCheck) March 16, 2023
కేవలం ఇది మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మెసేజ్‌లు వైరల్ అవుతూ ఉంటారు. ఉచితంగా రీచార్జ్ చేసుకోవచ్చు, అమ్మాయిలకు పెళ్లి కానుక,సహా పలు రకాల ఫేక్ న్యూస్‌లు వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఇలా వైరల్ అవుతున్న మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలి. ఆశపడి ఆలోచించకుండా తొందరపడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇంకా ఇటీవలనే పాత రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను మార్చుకోవడానికి ఇంకా టైమ్ ఉందంటూ ఒక ఫేక్ న్యూస్ ఇలానే వైరల్ అయ్యింది. ఇందులో కూడా ఎలాంటి నిజం లేదని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Laptop, Laptop offer, Laptops, Money, Pm modi