చైనాకు భారీ ఝలక్ ఇస్తూ భారత్ కొత్త ఎఫ్‌డీఐ పాలసీ...

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌తో బోర్డర్లు కలిగిన దేశాలుఇండియాలోని కంపెనీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పక తీసుకోవాలి.

  • Share this:
    విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి భారత్ కొన్ని మార్పులు చేసింది. కొత్తగా కొన్ని నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPITT) జారీ చేసిన ప్రకటన ప్రకారం భారత్‌తో బోర్డర్లు కలిగిన దేశాలు ఇండియాలోని కంపెనీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పక తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనలు మార్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంపెనీలకు కష్టకాలం వచ్చింది. లాక్ డౌన్ వల్ల కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. అలాంటి కంపెనీల మీద విదేశీ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఆయా సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసి.. భారత్‌లోని కంపెనీల్లో తమ వాటాను పెంచుకునేందుకు, లేదా ఏకమొత్తంగా కైవసం చేసుకునేందుకు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు భారత కంపెనీల ఓనర్ షిప్‌ను మార్పు చేసే అంశానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది.    గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను ఉద్దేశిస్తూ ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా జారీ చేసిన ఆదేశాలను పరిశీలిస్తే... ఇది చైనా కంపెనీలకు ఝలక్ లాంటిది. చైనాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లోని ఆర్థిక కష్టాల్లో ఉన్న కంపెనీల నుంచి వాటాలు కొనుగోలు చేయకుండా ఇలాంటి కట్టుబాట్లు విధించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: