EPFO: గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లోకి 8.65% వడ్డీ

EPFO | గత మూడేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ రావడంతో త్వరలోనే 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలోకి వడ్డీ జమ చేయనుంది ఈపీఎఫ్ఓ.

news18-telugu
Updated: September 19, 2019, 7:05 PM IST
EPFO: గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లోకి 8.65% వడ్డీ
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... త్వరలో అకౌంట్‌లోకి 8.65% వడ్డీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 19, 2019, 7:05 PM IST
ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని జమ చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాంతో త్వరలోనే దాదాపు 6 కోట్ల EPF సబ్‌స్రైబర్ల అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. గత నెలలో జరిగిన చర్చల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒప్పుకోకపోయినా 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65% వడ్డీ చెల్లించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. 8.65% వడ్డీ చెల్లించినా తమ సంస్థ దగ్గర సరిపడా మిగులు ఉందని ఆర్థిక శాఖకు ఈపీఎఫ్ఓ గతంలోనే స్పష్టం చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాల్లోకి 8.65% వడ్డీ రేటు చెల్లిస్తే ఈపీఎఫ్ఓ దగ్గర రూ.151.67 కోట్ల మిగులు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ 8.7% వడ్డీ చెల్లిస్తే మాత్రం రూ.158 కోట్ల లోటు ఏర్పడుతుంది. అందుకే 8.65% వడ్డీని ఫిక్స్ చేసింది ఈపీఎఫ్ఓ.

గత మూడేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ రావడంతో త్వరలోనే 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలోకి వడ్డీ జమ చేయనుంది ఈపీఎఫ్ఓ. దాంతో ఇకపై జరిగే క్లెయిమ్‌లు అన్నీ కొత్త వడ్డీ రేటు ప్రకారమే మంజూరు కానున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేసుకునేవారికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.55% వడ్డీ మాత్రమే లభిస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 8.55% వడ్డీ రేటును ముందే ఫిక్స్ చేశారు. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65% వడ్డీ రేటు ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8% వడ్డీ రేటు ఉండేది.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...