• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOVERNMENT HAS DECLARED THE BONUS APPLICABLE TO POST OFFICE LIFE INSURANCE POLICIES AND ALSO RURAL POSTAL LIFE INSURANCE POLICIES NS GH

PLI Bonus: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్.. ఏయే పథకాలకు ఎంతంటే..

PLI Bonus: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్.. ఏయే పథకాలకు ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

Post Office Life Insurance Polices: పోస్టాఫీసులో జీవిత పాలసీలు కలిగి ఉన్నారా? అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న మీకు ఓ శుభవార్త. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది.

  • Share this:
పోస్టాఫీసులో జీవిత పాలసీలు కలిగి ఉన్నారా? అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న మీకు ఓ శుభవార్త. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ)కు బోనస్ వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ బోనస్ అమలులోకి వస్తుంది. అస్యూరెన్స్ లో వేయి రూపాయలకు రూ.76,  ఎండోమెంట్ అస్యూరెన్స్ అయితే వేయికి రూ.52 బోనస్ అందుకుంటారు. పోస్టాఫీసులో ఆరు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అవన్నీ సంప్రదాయబద్దమైన బీమాలు. అంటే లైఫ్ అస్యూరెన్స్(సురక్షా), ఎండోమెంట్ అస్యూరెన్స్(సంతోష్), జాయింట్ లైఫ్ అస్యూరెన్స్(యుగల్ సురక్ష), చిల్డ్రన్ పాలసీ(బాల్ జీవన్ బీమా), వోల్ లైఫ్ ఇన్సూరెన్స్(సువిధ), యాంటిస్పేటెడ్ అస్యూరెన్స్(సుమంగల్) లాంటి బీమా పథకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ నియమాలు(2011) ప్రకారం 2020 మార్చి 31 నాటికి పోస్టాఫీసు లైఫ్ ఇన్సురెన్స్ ఫండ్(PLIF) ఆస్తులు, అప్పుల వ్యాల్యూయేషన్ ఆధారంగా పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలపై సాధారణ రివర్షనరీ బోనస్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోనస్ మరణం లేదా పాలసీ కాలపరిమితి ఆధారంగా చెల్లిస్తారు.

ఈ బీమా పాలసీలపై బోనస్ ప్రకటించింది..
-వోల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ(డబ్ల్యూఎల్ఏ)పై వెయ్యికి రూ.76లు అదనంగా లభిస్తుంది.
-ఎండోమెంట్ అస్యూరెన్స్(ఈఏ)పై ఉమ్మడి జీవితం మరియు పిల్లల పాలసీలతో సహా వెయ్యికి రూ.52 బోనస్ వస్తుంది.
-యాంటిస్పెటేడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీపై వెయ్యికి 48 రూపాయలు అదనపు సొమ్ము లభిస్తుంది.
-కన్వర్టబుల్ వోల్ లైఫ్ పాలసీలు(సీడబ్ల్యూఏ)పై వోల్ లైఫ్ బోనస్ రేటు వర్తిస్తుంది. అయితే మార్చుకుంటే ఎండోమెంట్ అస్యూరెన్స్ బోనస్ రేటు లభిస్తుంది.
-రూ. 10000లు మొత్తంపై రూ.20లు టెర్మినల్ బోనస్ తో పాటు గరిష్ఠంగా రూ.1000 వస్తుంది. ఇది 20 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది.

పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కమ్యునికేషన్స్ మంత్రిత్వశాఖ పరిధిలోని పోస్టల్ విభాగం నిర్వహిస్తోంది. ఇది పీఎల్ విధానాల్లోని సావరిన్ గ్యారంటీని ఇస్తుంది.  1894 నుంచి పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ) ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. వీటిలో ప్రభుత్వ రంగం సంస్థలు, ఆర్థిక సంస్థలు, జాతీయం చేసిన బ్యాంకుల ఉద్యోగులు ఉన్నారు. అయితే 2017 నుంచి దీన్ని మరింత విస్తృత జనాభాకు అందుబాటులో తీసుకొచ్చారు. వైద్యులు, ఇంజినీర్లు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్, ఛార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్, న్యాయవాదులు, బ్యాంకర్లు వంటి నిపుణులుకు పీఎల్ఐ కింద జీవిత బీమా పాలసీలను ఇస్తున్నారు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉద్యోగులకు కూడా బీమాను అందిస్తున్నారు.

గ్రామీణ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలపై బోనస్..
-వోల్ లైఫ్ అస్యూరెన్స్(డబ్ల్యూఎల్ఐ)పై హామీ ఇచ్చిన వెయ్యికి రూ.60లు లభిస్తుంది.
-ఎండోమెంట్ అస్యురెన్స్ పై హామీ ఇచ్చిన వెయ్యికి రూ.48లు వస్తుంది.
-యాంటిస్పెటేడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీపై వెయ్యికి 45 రూపాయలు అదనపు సొమ్ము లభిస్తుంది.
-కన్వర్టబుల్ వోల్ లైఫ్ పాలసీలు(సీడబ్ల్యూఏ)పై వోల్ లైఫ్ బోనస్ రేటు వర్తిస్తుంది. అయితే మార్చుకుంటే ఎండోమెంట్ అస్యూరెన్స్ బోనస్ రేటు లభిస్తుంది.
-రూ. 10000లు మొత్తంపై రూ.20లు టెర్మినల్ బోనస్ తో పాటు గరిష్ఠంగా రూ.1000లు వస్తుంది. ఇది 20 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు